Allu Arjun: అల్లు అర్జున్‌ బర్త్‌డే స్పెషల్‌.. మళ్లీ థియేటర్లలోకి బన్నీ బ్లాక్‌ బస్టర్‌ సినిమా.. ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రెగ్యులర్‌ రిలీజులతో పాటు రీరిలీజ్‌ల సందడి బాగా పెరిగిపోయింది. గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. మహేశ్‌ పోకిరీతో స్టార్ట్‌అయిన ఈ ట్రెండ్‌ తాజాగా రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఆరెంజ్‌ వరకు వచ్చింది.

Allu Arjun: అల్లు అర్జున్‌ బర్త్‌డే స్పెషల్‌.. మళ్లీ థియేటర్లలోకి బన్నీ బ్లాక్‌ బస్టర్‌ సినిమా.. ఎప్పుడంటే?
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2023 | 5:29 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో రెగ్యులర్‌ రిలీజులతో పాటు రీరిలీజ్‌ల సందడి బాగా పెరిగిపోయింది. గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. మహేశ్‌ పోకిరీతో స్టార్ట్‌అయిన ఈ ట్రెండ్‌ తాజాగా రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఆరెంజ్‌ వరకు వచ్చింది. మధ్యలో ఒక్కడు, జల్సా, వర్షం తదితర సినిమాలు రీ రిలీజయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి అల్లు అర్జున్‌ బ్లాక్ బస్టర్‌ మూవీ దేశ ముదురు కూడా చేరునుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 6న దేశముదురు సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘మరోసారి థియేటర్‌లలో బాలగోవింద్‌ (అల్లు అర్జున్‌) స్టైలిష్‌, మాస్‌ స్వాగ్‌నిచూడటానికి సిద్ధంగా ఉండండి! ఏప్రిల్‌ 6న కుమ్మేస్కుందాం’ అని డీవివి దానయ్య ఎంటర్‌టైనమెంట్స్‌ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో  అల్లు అర్జున్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈసారి రచ్చ మాములుగా ఉండదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ సినిమాలతో హీరోగా మంచి క్రేజ్‌ తెచ్చుకుంటున్న అల్లు అర్జున్‌ దేశ ముదురు సినిమాతో స్టార్‌ హీరోల కేటగిరిలోకి చేరిపోయారు. సెన్సేషనల్‌ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బన్నీ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించడం విశేషం. ఈ సినిమాతోనే యాపిల్‌ బ్యూటీ హన్సికా మెత్వానీ హీరోయిన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దివంగత సంగీత దర్శకుడు చక్రి అందించిన స్వరాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. మరి దేశముదురు రీ-రిలీజ్‌తో ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.