AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: దుష్యంతుడి కోసం శకుంతల ఎదురుచూపులు.. ఆకట్టుకుంటున్న ‘మల్లికా’ వీడియో సాంగ్..

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మల్లికా... మల్లికా అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Shaakuntalam: దుష్యంతుడి కోసం శకుంతల ఎదురుచూపులు.. ఆకట్టుకుంటున్న 'మల్లికా' వీడియో సాంగ్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2023 | 5:14 PM

Share

డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన లేటేస్ట్ చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగుతోపాటు.. మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషలలో ప్రేక్షకుల మందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మల్లికా… మల్లికా అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

నిమిషంన్నర నిడివి ఉన్న ఈ సాంగ్ మల్లికా.. మల్లికా మాలతీ మాలిక.. చూడవా చూడవా ఏడే నా ఏలికా.. అంటూ సాగుతున్న ఈ పాటను రమ్య బెహ్రా ఆలిపించగా.. మణిశర్మ సంగీతం అందించారు. దుష్యంతుడి కోసం ఎదురుచూస్తు శకుంతల పాడుకునే పాటగా దీన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు.

అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగల్ల, గౌతమి కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా.. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
RCB vs SRH Live Score: తొలి పోరుకు అంతా సిద్ధం..
RCB vs SRH Live Score: తొలి పోరుకు అంతా సిద్ధం..
కరుంగళి మాలను ఎవరు ధరించాలి? సంపద, అదృష్టం రహస్యాలు తెలుసుకోండి!
కరుంగళి మాలను ఎవరు ధరించాలి? సంపద, అదృష్టం రహస్యాలు తెలుసుకోండి!
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ