సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

ఇచ్చిన మాట కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్ల బాధ్యతలను భుజానకెత్తుకునే పాత్రలో బాలకృష్ణ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ ముగ్గురి అక్కాచెల్లెళ్లలో దివ్యాంగురాలి పాత్ర (సరస్వతి)లో అద్భుతంగా నటించింది సహస్ర. బాలకృష్ణ, ఈ అమ్మాయి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ సీన్స్  అందరినీ కంటతడి పెట్టిస్తాయి.

సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Child Artist
Follow us

|

Updated on: Apr 03, 2023 | 6:16 AM

బాలకృష్ణ నటించిన సూపర్‌ హిట్ సినిమాల్లో సమరసింహారెడ్డి కూడా ఒకటి. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సిస్టర్‌ సెంటిమెంట్‌ కూడా బాగా వర్కవుట్‌ అయ్యింది. ఒకే కడుపున పుట్టకపోయినా ఇచ్చిన మాట కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్ల బాధ్యతలను భుజానకెత్తుకునే పాత్రలో బాలకృష్ణ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ ముగ్గురి అక్కాచెల్లెళ్లలో దివ్యాంగురాలి పాత్ర (సరస్వతి)లో అద్భుతంగా నటించింది సహస్ర. బాలకృష్ణ, ఈ అమ్మాయి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ సీన్స్  అందరినీ కంటతడి పెట్టిస్తాయి. అయితే ఈ సినిమా కంటే ముందే ఎన్నో వందలాది చిత్రాల్లో నటించింది సహస్ర. రౌడీ అల్లుడు, హిట్లర్‌, ముగ్గురు మొనగాళ్లు, సమర సంహారెడ్డి, మేజర్‌ చంద్రకాంత్‌ వంటి హిట్‌ సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, శోభన్‌ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో సహస్ర పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్‌ మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో మంచు మనోజ్‌ తో కలిసి తను నటించిన ‘సుఖీభవ.. సుమంగళి’ అనే పాట చాలమందికి గుర్తుంటుంది. అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి చదువును నిర్లక్ష్యం చేయకూడదనుకుంది. అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి ఉన్నత చదువులకు వెళ్లిపోయింది. సమరసింహారెడ్డినే సహస్ర నటించిన ఆఖరి సినిమా కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఛానెల్‌ ఇంటర్యూకు హాజరైంది సహస్ర. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉంది. అలాగే ఇంటర్వ్యూలో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా తన లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది సహస్ర. ‘భానుచందర్‌గారి ఉద్యమం నా మొదటి సినిమా. అప్పుడు నేను చిన్నపిల్లను కావడంతో హీరోలందరూ నన్ను బాగా చూసుకున్నారు. రామ్‌చరణ్‌ ఇంటికి వెళ్లి అక్కడున్న టెడ్డీబేర్‌తో ఆడుకునేదాన్ని. ఒకసారి చెన్నైలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు చెర్రీనే ఉప్మా చేసి పెట్టారు. అవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. ఇక ఎన్టీఆర్‌ మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా షూటింగ్‌ టైంలో మనోజ్‌, నేను కలిసి సెట్‌కు వెళ్లేవాళ్లం. సమరసింహారెడ్డి నా చివరి సినిమా. చదువు మీద దృష్టి పెడదామని సినిమాలకు దూరమయ్యాను. మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ పూర్తి చేశాను. ఇప్పుడు బిజినెస్‌ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది సహస్ర.

ఇవి కూడా చదవండి
Sahasra

Sahasra

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..