Janhvi Kapoor : ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ పాత్ర అలా ఉండబోతుందట.. తారక్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా.. గత రెండు రోజుల క్రితం సెట్ లో అడుగుపెట్టారు తారక్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.

నందమూరి అభిమానులు చాలా రోజులు తారక్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విడుదలైన సంవత్సరం పూర్తైన ఎన్టీఆర్ తదుపరి చిత్రాల గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ 30 అప్డేట్స్ కోసం మేకర్స్‌పై ఒత్తిడి పెంచారు. ఇక గతంలో అమిగోస్, దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొన్న ఎన్టీఆర్‌ను సైతం నెక్ట్స్ మూవీ గురించి చెప్పాలంటూ విసిగించిడంతో.. తన నెక్ట్స్ చేయడం లేదంటూ సరదాగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఎట్టకేలకు NTR30 ప్రాజెక్ట్ షూరు అయ్యింది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా.. గత రెండు రోజుల క్రితం సెట్ లో అడుగుపెట్టారు తారక్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె రోల్ గురించి ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇందులో జాన్వీ ఓ మత్య్సకారుని కూతురిగా కనిపించనుందట. అంతేకాకుండా.. మాస్ అమ్మాయిగానూ ఆమె రోల్ ఉండబోతుందట. ఈ ప్రాజెక్ట్ కోసం జాన్వీ ఎన్నో రోజులుగా కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇది జాన్వీకి తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.




ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరగనుంది. అలాగే ఈ చిత్రం కాస్త మైథిలాజికల్ టచ్ లో ఉంటుందట. అలాగే ఇందులో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతుందట. అందుకు తగినట్టుగానే తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించనున్నట్లుగా సమాచారం.




