Trisha : నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ.. త్రిష కట్టిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Apr 01, 2023 | 6:12 PM

ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 మాత్రమే కాకుండా.. విజయ్ దళపతి నటిస్తోన్న లియో చిత్రంలోనూ నటిస్తుంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొంది త్రిష. ఈ వేడుకలో ఆమె లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.. నీలిరంగు చీరలో ఆ జాబిలమ్మను సైతం మరిపించింది.

Trisha : నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ.. త్రిష కట్టిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..
Trisha
Follow us

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన త్రిష… ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తోంది. గతంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాలో యువరాణి కుందవై పాత్రలో ఆమె నటన అద్భుతం. అంతేకాకుండా ఈ చిత్రంలో త్రిష మరింత అందంగా.. ఇప్పటి కుర్రహీరోయిన్లను మించి నిజంగానే ప్రిన్సెస్ లుక్‏లో కనిపించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష లుక్స్‏కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. దీంతో మరోసారి ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 మాత్రమే కాకుండా.. విజయ్ దళపతి నటిస్తోన్న లియో చిత్రంలోనూ నటిస్తుంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొంది త్రిష. ఈ వేడుకలో ఆమె లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.. నీలిరంగు చీరలో ఆ జాబిలమ్మను సైతం మరిపించింది.

త్రిష రాయల్ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ మరియు క్రిస్టల్ ఎంబెలిష్డ్ చీరను నెక్‌లైన్ క్వార్టర్ స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో త్రిష చీర కోసం మహిళలు గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ధర తెలిసి బిత్తరపోయే పరిస్థితి ఎదురైంది. ఆ చీర ఖరీదు దాదాపు లక్షా 30 వేల రూపాయాలు ఉంటుందట. ప్రముఖ డిజైనర్ గీతక కనుమిలి డిజైన్ చేసిన ఈ చీర.. అత్యంత ఖరీదైన చీరలలో ఒకటి. సారీకి తగినట్లుగా చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఆభరణాలు ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

మణిరత్నం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu