AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు టాలీవుడ్‏లో తను చాలా స్పెషల్.. ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

అందం, అభినయంతో ఫాలోయింగ్ పెంచుకుంది. దాదాపు స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవైపు తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్స్ చేసేస్తుంది.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు టాలీవుడ్‏లో తను చాలా స్పెషల్.. ఫాలోయింగ్ కూడా ఎక్కువే..
Guess This Actress
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2023 | 5:41 PM

Share

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తోన్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. అందం, అభినయంతో ఫాలోయింగ్ పెంచుకుంది. దాదాపు స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవైపు తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్స్ చేసేస్తుంది. అటు మానసికంగా.. శారీరకంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమె… ఇప్పుడిప్పుడే మనో ధైర్యంతో కోలుకుంటుంది. ఎవరో గుర్తుపట్టండి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ముందుంటుంది. గత కొంతకాలంగా ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే స్టార్ హీరోయిన్ సమంత.

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. తొలి సినిమాతోనే జెస్సీ పాత్రతో ఆడియన్స్ మదిని దోచుకుంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, మనం, అఆ, మహానటి, యూటర్న్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సిటాడెల్ చిత్రంలోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

అలాగే కొద్ది రోజులుగా ఆమె నటించిన శాకుంతలం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది సామ్. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, అల్లు అర్హ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం సామ్ ఖుషి చిత్రీకరణలో భాగంగా కేరళలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం