Prabhas: ‘అబ్బా ఏం సినిమా రా బాబు.. నాకు తెగ నచ్చేసింది’.. ‘దసరా’ మూవీపై ప్రభాస్ ప్రశంసలు..

తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఇప్పటివరకు కేవలం తెలుగులోనే దాదాపు రూ. 28 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Prabhas: 'అబ్బా ఏం సినిమా రా బాబు.. నాకు తెగ నచ్చేసింది'.. 'దసరా' మూవీపై ప్రభాస్ ప్రశంసలు..
Prabhas, Dasara
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2023 | 7:16 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దసరా చిత్రం హవా నడుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని పక్కా ఊరమాస్ పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకోవడమే కాకుండా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 71 కోట్లు రాబట్టింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు నాని నటించిన అన్ని సినిమాల్లోకంటే.. భారీ విజయాన్ని అందుకున్న ఏకైక చిత్రం దసరా. ఇందులో నాని జోడిగా కీర్తి సురేష్ నటించింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఇప్పటివరకు కేవలం తెలుగులోనే దాదాపు రూ. 28 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీపై ప్రభాస్ రివ్యూ ఇచ్చేశాడు. ఇప్పుడే దసరా సినిమా చూశానని.. తనకు తెగ నచ్చేసిందని.. సినిమా మొత్తం తాను చాలా ఎంజాయ్ చేశానంటూ.. నానికి కంగ్రాట్స్ చెబుతూ.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ టేకింగ్ అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కీర్తి సురేష్ తోపాటు.. మిగతా చిత్రయూనిట్ పై కూడా ప్రశంసలు కురిపించారు ప్రభాస్. డార్లింగ్ చేసిన పోస్ట్ పై అభిమానులు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!