AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: అన్నయ్యను ఆటపట్టించిన వెంకీ కూతురు.. రానాతో కలిసి వంటింట్లో అశ్రిత సందడి..

ఇక తాజాగా వెంకటేష్ కూతురు.. తన చెల్లెలు ఆశ్రితతో కలిసి నేరుగా పిజ్జాలు తయారు చేశాడు రానా. అసలు పిజ్జా ఎలా తయారవుతుందో అంటూ అన్నాచెల్లెళ్లు మాట్లాడిన తీరు ఆకట్టుకోగా.. తన మాటలతోనే రానాను ఆటాడుకుంది ఆశ్రిత.

Rana Daggubati: అన్నయ్యను ఆటపట్టించిన వెంకీ కూతురు.. రానాతో కలిసి వంటింట్లో అశ్రిత సందడి..
Rana
Rajitha Chanti
|

Updated on: Apr 03, 2023 | 7:45 AM

Share

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ అందుకున్న ఈ హీరో.. కేవలం హీరోయిజం చిత్రాలే కాకుండా.. కంటెంట్ నచ్చితే చాలు ఎంతటి చిన్న సినిమా అయిన చేసేందుకు ముందున్నాడు. చివరగా విరాట పర్వం చిత్రంలో సాయి పల్లవికి జోడిగా నటించారు రానా. ఇక ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలో సందడి చేశారు. ఇటీవల తన భార్య మిహీకా పుట్టిన రోజు కానుకగా హైదరాబాద్ లోని తన ఇంట్లో ఆమె కోసం క్యాండిల్ లైట్ పిజ్జా పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకటేష్ కూతురు.. తన చెల్లెలు ఆశ్రితతో కలిసి నేరుగా పిజ్జాలు తయారు చేశాడు రానా. అసలు పిజ్జా ఎలా తయారవుతుందో అంటూ అన్నాచెల్లెళ్లు మాట్లాడిన తీరు ఆకట్టుకోగా.. తన మాటలతోనే రానాను ఆటాడుకుంది ఆశ్రిత.

వెంకటేశ్ కూతురు ఆశ్రిత.. ఫుడ్ బ్లాగర్. ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో బేకరీ ఫుడ్స్ బిజినెస్ చైన్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పేరుతో ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. గతంలో తన బావ నాగచైతన్యతో కలిసి పలు వంటలు చేసిన ఆశ్రిత.. ఇప్పుడు తన అన్నయ్య రానాతో కలిసి పిజ్జాలు రెడీ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఆశ్రిత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. అందులో మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు నివాసం ఉన్న ఆ పాత ఇంట్లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్టారు రానా. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అతడితోపాటు.. ఆ ఇంట్లో తన అల్లరి పనులు గురించి ఆశ్రిత చెప్పుకొచ్చింది.. తన ఫేవరెట్ బాల్కనీని రానా చూపించారు.

జూబ్లీహిల్స్ ఏరియాలోని రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఈ ఇల్లు ఉంది. అక్కడ ఎన్నో అందమైన కళాకృతులు భారీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయ. అలాగే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్.. కిచెన్ దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఇంటిని శాంక్చువరీ పేరుతో ఓ రెస్టారెంట్ గా మార్చి రానా స్నేహితుడు రన్ చేస్తున్నారట. మొత్తానికి అన్నయ్యతో కలిసి ఆశ్రిత చేసిన సరదా వీడియో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..