Tollywood: ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.. 17 ఏళ్లకే మిస్ ఇండియా అయ్యింది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Apr 01, 2023 | 7:43 PM

భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ నృత్యకారిణి. అలాగే కేవలం 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఓ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరేట్.

Tollywood: ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.. 17 ఏళ్లకే మిస్ ఇండియా అయ్యింది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us

డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగుతోపాటు.. హిందీ చిత్రపరిశ్రమలోనూ టాప్ హీరోయిన్. 80-90లలో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. నటనతోపాటు.. డ్యాన్స్ లోనూ ఈ అమ్మాయికి మరెవరూ సాటిలేరు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ నృత్యకారిణి. అలాగే కేవలం 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఓ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరేట్. ఎవరో గుర్తుపట్టండి. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ చిత్రాలు చేసి.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యారు. గుర్తుపట్టండి.

తను మరెవరో కాదు.. 80-90లలో హీరో, దిల్ వాలా, దామిని, ఘటక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన మీనాక్షి శేషాద్రి. పెయింటర్ బాబు చిత్రంతో నటి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. మీనాక్షి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు, ఆమె భరతనాట్యం, కూచిపూడి, కథక్ మరియు ఒడిస్సీలలో శిక్షణ పొందిన నృత్యకారిణి. బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్‌తో చేసిన హీరో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

తెలుగులో 1992లో డైరెక్టర్ కె.విశ్వనాధ్ తెరకెక్కించిన ఆపద్భాంధవుడు చిత్రంలో నటించింది మీనాక్షి. ఇందులో చిరంజీవి, మీనాక్షి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వర రావు నిర్మించగా.. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu