Health Tips: గర్భనిరోధక మాత్రలు తరుచూ వాడుతున్నారా? భయంకరమైన విషయం వెల్లడించిన ఓ మహిళ..

అవాంఛిత గర్భధారణను నివారించడానికి మహిళలు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. అయితే, అవాంఛిత గర్భాన్ని నిరోధించడంలో ఫర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. అదే సమయంలో శరీరానికి చాలా హానీకరంగానూ మారుతుంది. అందుకే వైద్యుల సలహా లేకుండా ఈ మాత్రలు వేసుకోవద్దని నిపుణులు..

Health Tips: గర్భనిరోధక మాత్రలు తరుచూ వాడుతున్నారా? భయంకరమైన విషయం వెల్లడించిన ఓ మహిళ..
Contraceptive Pill
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2023 | 1:53 PM

అవాంఛిత గర్భధారణను నివారించడానికి మహిళలు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. అయితే, అవాంఛిత గర్భాన్ని నిరోధించడంలో ఫర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. అదే సమయంలో శరీరానికి చాలా హానీకరంగానూ మారుతుంది. అందుకే వైద్యుల సలహా లేకుండా ఈ మాత్రలు వేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో ఇందుకు సంబంధించిన షాకింగ్ కేసు ఒకటి తెరపైకి వచ్చింది. గర్భనిరోధక మాత్రల కారణంగా 25 ఏళ్ల యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. నోటి ద్వారా గర్భనిరోధక మాత్ర తీసుకున్న కొన్ని వారాల తర్వాత.. హోలీ మెక్‌కోమిష్ తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కొంది.

ది సన్ నివేదిక ప్రకారం.. హోలీ మెక్‌కోమిష్ మైక్రోజినాన్ 30 అనే గర్భనిరోధక మాత్రను తీసుకుంది. వృత్తిరీత్యా థియేటర్ ప్రొడ్యూసర్ అయిన ఆమె తన శరీరంలోనే ఏదో తేడా పరిణామాలు జరుగుతున్నాయని గుర్తించింది. తాను ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. హోలీ మెక్‌కోమిష్ ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది. ఆ వివరాలు యధావిధంగా..

మసక దృష్టి..

మొదట తాను ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించి. అయితే అక్టోబర్ 2021 నెలలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొనగా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ తరువాత అస్పష్టంగా కనిపించడం మొదలైంది. ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఇంతలో కొందరు ఆమె పరిస్థితిని గమనించి వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. దీనికి రెండు నెలల ముందు.. డాక్టర్ ఫోన్ కాల్‌లో గర్భనిరోధక మాత్ర ఇచ్చారని మహిళ చెప్పింది. అయితే, డాక్టర్ దాని దుష్ప్రభావాలు చెప్పలేదు. దాని గురించి ఆమె కూడా అడగలేదు.

డిప్రెషన్ లక్షణాలు..

ముందుగా ఆమెలో డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ క్రమంగా ఆమెకు తలనొప్పి, నీరసం మొదలయ్యాయి. ఇవన్నీ సాధారణ విషయాలు అని హోలీ మెక్‌కోమిష్ భావించింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు మినీ స్ట్రోక్ వచ్చింది. మెదడుకు తాత్కాలికంగా రక్తసరఫరాలో ఇబ్బంది ఏర్పడింది. రక్తం గడ్డకట్టడం ప్రారంభమైంది.

ఆ వెంటనే గర్భనిరోధక మాత్రలు వేసుకోవద్దని వైద్యులు ఆమెకు సూచించారు. ఆ తర్వాత ఆమెకు రక్తం పలుచబడేలా మందులు ఇచ్చారు. మెదడులో రక్తం గడ్డలు కట్టిందని, అందుకు సంబంధించిన చికిత్స చేశారు. సర్జరీ అనంతరం మహిళ పూర్తి క్షేమంగా బయటపడింది.

గర్భనిరోధక మాత్రలు అంటే ఏంటి?

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్ కలపడం ద్వారా అవి తయారవుతాయి. ఈ హార్మోన్లు ల్యుటినైజింగ్ హార్మోన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను విడుదల చేయకుండా మెదడును నిరోధిస్తాయి. తద్వారా గర్భధారణను నిరోధిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..