AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Juice Benefits: వేసవిలో ఈ 5 రకాల గ్రీన్ జ్యూస్‌లు తప్పక తాగండి.. హెల్త్ బెనిఫిట్స్ అదుర్స్..!

ఎండాకాలం వచ్చిందంటే దాహం కూడా పెరుగుతుంది. జ్యూస్, మజ్జిగ, ఐస్ క్రీం ఇలా ఎన్నో శీతల పానీయాలు తాగాలని మనసు తహతహలాడుతుంది. అయితే, వేసవిలో కూడా శీతాకాలం, వర్షాకాలం మాదిరిగానే మనం తినే ఆహారం నుంచి వచ్చే వ్యాధులు చాలానే ఉన్నాయి.

Green Juice Benefits: వేసవిలో ఈ 5 రకాల గ్రీన్ జ్యూస్‌లు తప్పక తాగండి.. హెల్త్ బెనిఫిట్స్ అదుర్స్..!
Green Juice
Shiva Prajapati
|

Updated on: Apr 04, 2023 | 1:49 PM

Share

ఎండాకాలం వచ్చిందంటే దాహం కూడా పెరుగుతుంది. జ్యూస్, మజ్జిగ, ఐస్ క్రీం ఇలా ఎన్నో శీతల పానీయాలు తాగాలని మనసు తహతహలాడుతుంది. అయితే, వేసవిలో కూడా శీతాకాలం, వర్షాకాలం మాదిరిగానే మనం తినే ఆహారం నుంచి వచ్చే వ్యాధులు చాలానే ఉన్నాయి. వేసవిలో గొంతు మాత్రమే కాకుండా, మొత్తం శరీరాన్ని కూడా చల్లగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం గ్రీన్ జ్యూస్‌ బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ జ్యూస్ ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే, కింద చదివేసేయండి..

అలోవెరా జ్యూస్..

కలబందలో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, సోడియం, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అనేక శరీర సమస్యలను నయం చేయడంతో పాటు, ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో దీన్ని తాగడం వల్ల రోజంతా తాజాగా ఉంటుంది.

చెరకు రసం..

చెరకు రసం వేసవిలో సూపర్ ఎనర్జీ డ్రింక్‌గా చెప్పుకొవచ్చు. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఈ గ్రీన్ జ్యూస్ డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పొట్లకాయ రసం..

ఆరోగ్యానికి పొట్లకాయ కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్ వంటి మూలకాలు ఉంటాయి. రోజూ ఆహారంలో ఒక గ్లాస్ పొట్లకాయ రసం తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

కాకరకాయ రసం..

కాకరకాయ రసం చేదుగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి అది చేసే మేలు అమోఘం అని చెప్పాలి. డయాబెటిక్ పేషెంట్లకు కాకరకాయ రసం దివ్యౌషధం. దీనిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

పాలకూర జ్యూస్..

వేసవిలో ఆకు కూరలు తినడం చాలా మంచిది. మీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవడం ఉత్తమం. అలాగే పాలకూర జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..