Weight Loss Tips: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ. దీనికి ఎలాంటి గడువు లేదు. ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. కానీ బరువు తగ్గించే ప్రక్రియను సరిగ్గా చేస్తేనే దాని ఫలితాలు చాలా కాలం పాటు కనిపిస్తాయి. లేదంటే.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.

Weight Loss Tips: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
Lose Weight
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2023 | 12:45 PM

బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ. దీనికి ఎలాంటి గడువు లేదు. ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. కానీ బరువు తగ్గించే ప్రక్రియను సరిగ్గా చేస్తేనే దాని ఫలితాలు చాలా కాలం పాటు కనిపిస్తాయి. లేదంటే.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. చిన్నచిన్న పొరపాట్ల వల్ల చాలామంది మళ్లీ మళ్లీ బరువు పెరుగుతుంటారు. ఈ తప్పులను పదే పదే చేయడం వల్ల శరీరంపై, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.

మీరు కూడా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. వాటి తప్పక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మరి ఆ చేయకూడని తప్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆహారం తినడం మానుకోవద్దు..

బరువు తగ్గాలనుకునేవారు ఒక నియమాన్ని పాటిస్తారు. అదే ఆహారం తినకపోవడం. అయితే, ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఆహారం తినకపోవడం వల్ల బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమే అని చెబుతున్నారు. ఎవరైనా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గితే.. అది స్వల్పకాలం మాత్రమే ఉంటుందని, పైగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

జిమ్ సెషన్ మిస్ చేయడం..

చాలా మంది బద్దకం కారణంగానో, సమయం దొరక్కనో, మరే ఇతర కారణాలతోనో జిమ్, వ్యాయామానికి బ్రేక్ ఇస్తారు. అయితే, అది శరీరంపై దుష్ప్రభావం చూపుతుంది. వ్యాయామ క్రమశిక్షణను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరాకృతి మారిపోతుంది. అందుకే జిమ్ సెషన్‌ని అస్సలు మిస్ చేయొద్దు.

అతిగా తినొద్దు..

చాలా మంది అటు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఇష్టారీతిని తింటుంటారు. మితంగానైనా మళ్లీ మళ్లీ తింటారు. బరువు తగ్గడంలో ఇది ఒక మెథడ్ అని వారు భావిస్తారు. కానీ, ఇది వర్కౌట్ అవదని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ వ్యాయామం..

బరువు తగ్గే అంశంలో అతిపెద్ద అపోహ.. అవసరమైన దానికంటే ఎక్కువ వర్కౌట్స్ చేయడం. అయితే, శరీరానికి కూడా విశ్రాంతి అవసరం అని గుర్తుంచుకోవాలి. మితిమీరిన వ్యాయామాలు శరీరానికి హానీ కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..