Balagam: బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు.. ఆనందంలో చిత్రయూనిట్
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ హైలైట్ గా నిలిచాయి.
చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాల్లో బలగం ఒకటి. నటుడు వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ హైలైట్ గా నిలిచాయి. సినిమా చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రియా దర్శి , కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రతి సీన్ హృదయాలను టచ్ చేసేలా తెరకెక్కించారు వేణు.
ఇక ఈ సినిమా ఇప్పటికే పలు అవార్డులు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. పలు థియేటర్స్ లోనూ ఈ సినిమా ఇంకా ఆడుతోంది. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో బలగం మూవీ అవార్డును అందుకుంది. దాంతో చిత్రయూనిట్ అందనంలో తేలిపోతున్నారు.