Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pink Moon: ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం.. ఉదయాన్నే కనిపించిన పింక్ మూన్..

అందాల చందమామ.. గత కొద్దిరోజులుగా అంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న పింక్‌ మూన్‌ ఈ తెల్లవారు ఝామున ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. పింక్‌ మూన్‌ అంటే ఆకాశాన చందమామ గులాబీ రంగులోకి మారతాడనుకుంటే మీరు పొరబడ్డట్టే.. చంద్రుడు భూమికి అతి దగ్గరగా రావడాన్నే పింక్‌ మూన్‌ అంటారు.

Pink Moon: ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం.. ఉదయాన్నే కనిపించిన పింక్ మూన్..
Pink Moon
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2023 | 8:54 AM

అందాల చందమామ.. గత కొద్దిరోజులుగా అంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న పింక్‌ మూన్‌ ఈ తెల్లవారు ఝామున ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. పింక్‌ మూన్‌ అంటే ఆకాశాన చందమామ గులాబీ రంగులోకి మారతాడనుకుంటే మీరు పొరబడ్డట్టే.. చంద్రుడు భూమికి అతి దగ్గరగా రావడాన్నే పింక్‌ మూన్‌ అంటారు. వసంతకాలంలో వచ్చే తొలిపౌర్ణమినే పింక్‌ మూన్‌ అని పిలుస్తారు ఇంగ్లీషు వాళ్ళు. ఈ చంద్రుణ్ణి పాస్‌ ఓవర్‌ మూన్‌ అనికూడా అంటారు. అంటే ఈస్టర్‌కి ముందొచ్చే చంద్రుడని అర్థం. ఇదే పింక్‌ మూన్‌తో ఇప్పుడు గగనవీధులు ప్రకాశిస్తుంటాయి. ఈ రోజే కాదు మరో వారం రోజుల పాటు ఈ పింక్‌ మూన్‌ ప్రభావం ఉంటుందంటున్నారు సైంటిస్టులు.

ఇండియాలో పింక్‌ మూన్‌.. అంటే.. వసంత చంద్రుడు.. బుధవారం అర్థరాత్రి దాటాక.. గురువారం తెల్లవారు ఝాము మధ్యలో ఆవిష్కృతమయ్యాడు. దాదాపు ఈ వారమంతా చందమామ అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు తన కక్షలో తిరిగే క్రమంలో భూమికి అతిదగ్గరగా వచ్చిన ఈ రోజున చంద్రుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని సూపర్‌ మూన్‌ అని కూడా అంటారు.

నార్త్‌ అమెరికాలో ఏప్రిల్ పౌర్ణమిని పింక్‌ మూన్‌ అని ఇతర ప్రాంతాల్లో గ్రాస్‌మూన్‌, ద ఎగ్‌ మూన్‌, ద ఫిష్‌ మూన్‌, బ్రేకింగ్ ఐస్ మూన్, బడ్డింగ్ మూన్, అవేకనింగ్ మూన్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే జంతువులపైనా, మనుషులపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందంన్నది జ్యోతిష్య శాస్త్రవేత్తల అభిప్రాయం. పింక్‌ మూన్‌తో అనారోగ్యాలు పెరుగుతాయనీ, కొత్త కొత్త జబ్బులు వస్తాయనీ జ్యోతిష్య శాస్త్రవేత్తల అభిప్రాయం. గతంలో సునామీలు సైతం ఇదే పింక్‌ మూన్‌ సందర్భంగా వచ్చిందంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే సైంటిస్టులు మాత్రం ఖగోళపరమైన అద్భుతాల్లో పింక్‌ మూన్‌ ఒకటంటున్నారు. అందుకే దీన్ని ఆస్వాదించాలంటున్నారు. సో ఈ వారంలో చందమామ అందాలను వీక్షించేందుకు సిద్ధం కండి.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..