Motorola Edge 40 Pro: 50 ఎంపీ సెల్ఫీ కెమెరా.. 125 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌.. ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..

ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపీ టెలీ ఫొటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపీ భారీ సెల్ఫీ కెమెరా అందించారు.

Motorola Edge 40 Pro: 50 ఎంపీ సెల్ఫీ కెమెరా.. 125 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌.. ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..
Moto X40 Edge 40 Pro
Follow us
Madhu

|

Updated on: Apr 06, 2023 | 3:45 PM

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోటోరోలా ఎడ్జ్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ చేసింది. యూరోపియన్‌, లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఆవిష్కరించింది. త్వరలో మన దేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిలో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 165Hz రిఫ్రెష్ రేట్‌ ఓతో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతోపాటు , 4600ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తోంది. దీనిలో ఉన్న మరో ప్రత్యేకత ఎంటంటే ఏకంగా 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అలాగే 50ఎంపీ ఫ్రంట్‌ సెల్పీ కెమెరాతో ఆశ్చర్యపరిచింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్పెసిఫికేషన్స్‌ ఇవి.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ ప్లే 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది. 394 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా సెటప్‌.. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపీ టెలీ ఫొటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపీ భారీ సెల్ఫీ కెమెరా అందించారు.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం.. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ డివైజ్ 8 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ఉంది. డివైజ్ బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ 3.2, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వచ్చింది.

ధర ఎంతంటే.. మోటోరోలా ఎడ్జ్‌ 40 ప్రో డివైజ్‌ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 899.99 యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.81,000 గా ఉంది. ఈ డివైజ్ యూరోపియన్ మార్కెట్స్ లో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. మోటోరోలా సంస్థ భవిష్యత్తులో మరిన్ని వేరియంట్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..