- Telugu News Photo Gallery Business photos Upcoming SUVs in India; From Maruti Jimny to Mahindra Bolero Neo Plus checkout for full details
Upcoming SUVs: కార్ ప్రేమికులకు శుభవార్త.. ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేస్తున్న టాప్ 5 ఎస్‌యూవీలివే..
5 రోజుల క్రితమే అంటే ఏప్రీల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం‘(2023-24) ప్రారంభమైంది. దీంతో కార్ కంపెనీలన్నీ తమ కొత్త ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 05, 2023 | 6:29 PM

Maruti Jimny: భారతదేశంలోని కార్ ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాహనాలలో మారుతి జిమ్నీ కూడా ఒకటి. ఇక ఈ కార్ విక్రయాలు మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారుకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. దీనితో పాటు 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాయిస్ ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్‌లో ఉన్న మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖాతో పోటీపడనుంది.

Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికను పొందుతుంది. అవి 1.0L, 1.2L. దీని ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. భారత మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత రెనాల్ట్ కిగర్, టాటా పంచ్ , నిస్సాన్ మాగ్నైట్‌లతో పోటీపడుతుందని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

Citroen C3 Aircross: సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఏప్రిల్ 27న విడుదల అవుతుంది. ఆపై కొన్ని నెలల తర్వాత దీని విక్రమయాలు ప్రారంభమవుతాయి. ఈ SUV కార్ 5-సీటర్, 7-సీటర్ ఎంపికలలో అందించబడుతుంది. దీనిలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందవచ్చు.

Honda Elevate: హోండా కంపెనీ కూడా తన ఎలివేట్ కారును ఏప్రిల్‌లో తీసుకురాబోతోంది.ఈ కారు ఇంజిన్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో ఉండవచ్చు. అందులో ADAS సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. అయితే ఈ కార్ గురించి, దాని ఫీచర్ల గురించి ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

Mahindra Bolero Neo Plus: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో రాబోతున్న మహీంద్రా బొలెరో నియో ప్లస్‌ను 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్‌లలో పొందవచ్చు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందే అవకాశం ఉంది. బొలెరో నియో కంటే ఈ ఎస్‌యూవీ ధర రూ. 1 లక్షకు పైనే ఎక్కువ.





























