- Telugu News Photo Gallery Business photos Here are the Top 5 EV cars under Rs 15 Lakh in India, check list,
Top EV Cars Under 15L: దేశంలోని బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ధర, ఫీచర్లు, మైలేజీ అన్నింట్లోనూ టాప్..
ప్రపంచం అంతా కూడా పర్యావరణహితమైన రవాణా వ్యవస్థ వైపు చూస్తోంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇదే సరైన మార్గమని ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగానే విద్యుత్‌శ్రేణి వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. మన భారతదేశంలో కూడా ఆటోరంగం విద్యుత్ శ్రేణిని అందిపుచ్చుకుంటోంది. సరసమైన ధరలకు విద్యుత్ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు అది కూడా మంచి పనితీరు కలిగిన కార్లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ధర కూడా కేవలం రూ. 15లక్షల లోపే ఉంటుంది.
Updated on: Apr 05, 2023 | 4:00 PM

టాటా టియాగో ఈవీ(Tata Tiago ev).. మన దేశంలోని ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన టాటా మోటర్స్ ఈవీ వాహనాల విషయంలో ముందంజలో ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టాటా టియాగో ఈవీ అత్యంత చవకైన ఈవీ కారుగా నిలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షలు. దీనిలోన బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలుగుతుంది.

మహీంద్రా ఈ-వెరిటో(Mahindra E-Verito).. దేశంలో పాత మోడల్ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా ఈ వెరిటో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.13 లక్షలు. మార్కెట్లో లభ్యమవుతున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ వేరియంట్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్‌పై 140 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిలో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ వంటి ఫీచర్లున్నాయి.

సిట్రోయెన్ ఈ-సీ3(Citroen E-C3).. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ గత సంవత్సరం సీ3 హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ అదే కారుని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఈ-సీ3 పేరుతో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.50 లక్షలు. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

టాటా టిగోర్ ఈవీ(Tata Tigor EV).. టాటా మోటార్స్ నుంచి సబ్-4m ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ ఈవీ. టిగోర్ సెడాన్ కారుకు చిన్న స్టైలింగ్ మార్పులతో ఎలక్ట్రిక్ వెర్షన్ ను లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షలు. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్(Tata Nexon EV Prime).. టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ నెక్సాన్ దేశంలోనే ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో ఒకేసారి అందించబడిన మొదటి కారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.49 లక్షలు. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల శ్రేణిని అందిస్తుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఆఫర్‌లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది మాత్రమే.




