ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. తెల్లవారుజామున 4గంటలకు ఇంటికి వెళ్లి.. మరో ఇద్దరితో కలిసి..

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుచెప్పారని.. ఓ యువకుడు తన ప్రియురాలి కుటుంబం దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. తెల్లవారుజామున 4గంటలకు ఇంటికి వెళ్లి.. మరో ఇద్దరితో కలిసి..
Representative Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2023 | 9:11 AM

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుచెప్పారని.. ఓ యువకుడు తన ప్రియురాలి కుటుంబం దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాతల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలోని సితాల్‌కుచిలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పంచాయితీ స్థాయి నాయకురాలు, ఆమె భర్త, కుమార్తెను నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరో కుమార్తె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారు జామున 4గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కూచ్‌ బెహర్‌కు చెందిన విభూతి భూషణ్‌ అనే యువకుడు.. టీఎంసీ లీడర్ దంపతుల కుమార్తె ఇతి బర్మన్‌ అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసి వారి ప్రేమకు అడ్డు చెప్పడంతో భూషణ్‌ పగపెంచుకున్నాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇతి బర్మన్‌ ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇతి సహా ఆమె తండ్రి బిమల్‌ బర్మన్‌, తల్లి నీలిమ, సోదరి రూనా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తల్లి, తండ్రి, సోదరి మరణించారు. ఇతి బర్మన్‌ ప్రాణాలతో పోరాడుతుందని పోలీసులు తెలిపారు.

మృతులను నీలిమా బర్మన్ (52), ఆమె భర్త బిమల్ కుమార్ బర్మన్ (68), వారి కుమార్తె రునా బర్మన్ (24)గా గుర్తించారు. కాగా.. ప్రధాన నిందితుడిని స్థానికులు పట్టుకుని దాడి చేశారు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. మేము మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కూచ్ బెహార్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే