Telangana: ఉపాధి హామీ పనులు చేస్తుండగా బయటపడిన అద్భుతం.. రామ నామంతో మార్మోగిన ఆ ప్రాంతం..

మంచిర్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన రామలక్ష్మణ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ ఘటన జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ చెక్ పోస్ట్ సమీపంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రజలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా తపాలపూర్ చెక్ పోస్ట్ సమీపంలో

Telangana: ఉపాధి హామీ పనులు చేస్తుండగా బయటపడిన అద్భుతం.. రామ నామంతో మార్మోగిన ఆ ప్రాంతం..
Lord Rama And Laxmana
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 07, 2023 | 1:40 PM

మంచిర్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన రామలక్ష్మణ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ ఘటన జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ చెక్ పోస్ట్ సమీపంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రజలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా తపాలపూర్ చెక్ పోస్ట్ సమీపంలో పనులు చేస్తున్నారు. కొందరు కూలీలు గడ్డపారతో తవ్వకాలు జరుపుతుండగా.. వింత ఆకారం కనిపించింది. ఏంటా అని మట్టిని తవ్వి చూడగా.. పురాతన రామలక్ష్మణ విగ్రహాలు కనిపించాయి. వెంటనే విషయాన్ని మిగతా వారికి చెప్పారు. అందరూ ఆ రామలక్ష్మణ విగ్రహాలను వెలికి తీశారు. అక్కడే నీటితో అభిషేకం చేశారు. పసుపు, కుంకుమ, పూలు పెట్టి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. విషయాన్ని గ్రామాధికారులకు తెలియజేయగా.. వారు వచ్చి పరిశీలించారు.

కాగా, ఈ రామలక్ష్మణ విగ్రహాలు.. 1999లో తిమ్మాపూర్ రామాలయం నుంచి దొంగిలించిన విగ్రహాలుగా భావిస్తున్నారు స్థానిక ప్రజలు. విగ్రహాలు లభ్యమైన చోటే రామాలయం కట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, తవ్వకాల్లో లభ్యమైన ఈ విగ్రహాలను పరీశీలించాల్సి ఉంటుందని, ఇవి ఎప్పటివనేది నిర్ధారించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

బయటపడిన పురాతన విగ్రహాలు ఇవే..

Ramlaxman Idols

Ramlaxman Idols

విగ్రహాలకు పూజలు చేస్తున్న భక్తులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్