Vande Bharat Express Train: సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ బుకింగ్స్ ఓపెన్.. హాల్ట్స్, టికెట్ ధర వివరాలివే..
Vande Bharat Express Tickets Booking: శనివారం నుంచే సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం కాబోతోంది. ఈ రెండు ప్లేస్‌ల నుంచి నడిచే ఈ రైలు నెంబర్ 20701. వారంలో ఆరు రోజుల పాటు నడిచే ఈ ట్రైన్.. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.15కి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
శనివారం నుంచే సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం కాబోతోంది. ఈ రెండు ప్లేస్‌ల నుంచి నడిచే ఈ రైలు నెంబర్ 20701. వారంలో ఆరు రోజుల పాటు నడిచే ఈ ట్రైన్.. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.15కి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే, ఈ ట్రైన్ ప్రయాణానికి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెగ్యూలర్ సర్వీస్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి సికింద్రబాబ్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెగ్యూలర్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి టికెట్ బుకింగ్స్ ఏప్రిల్ 7వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి.
టికెట్ రేట్స్ చూద్దాం..
సికింద్రాబాద్-నల్గొండ మధ్య చైర్ కార్ అయితే రూ.470, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.900 ఉంటుంది. అలాగే సికింద్రాబాద్-గుంటూరు చైర్ కార్ అయితే రూ.865, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.1620 ఉంటుంది. సికింద్రాబాద్ – ఒంగోలు మధ్య చైర్ కార్ అయితే రూ.1075, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2045. అదే సికింద్రాబాద్-నెల్లూరు మధ్య చైర్ కార్ అయితే రూ.1270, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.2455 ఉంటుంది. ఇక స్టార్టింగ్ పాయింట్ సికింద్రాబాద్ నుంచి డెస్టినేషన్ తిరుపతి మధ్య చైర్ కార్ అయితే రూ.1,680 ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.3080 ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన..
Bookings open for the Regular #VandeBharat train service Between #Secunderabad – #Tirupati pic.twitter.com/LA536uF5CH
— South Central Railway (@SCRailwayIndia) April 7, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..