IPL Cheerleaders: చీర్‌లీడర్స్ ఆదాయమెంతో తెలుసా.. అమ్మో అంతనా అంటారు..!
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్. ఐపీఎల్ వేలం మొదలు.. లీగ్ ముగిసే వరకు సంబరమే. ఈ లీగ్ క్రికెట్ ప్లేయర్లకు కాసుల పంట పండిస్తుంది. స్టార్ ప్లేయర్లు మొదలు.. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న యువ క్రికెటర్ల వరకూ అందరికీ అదృష్ట రేఖగా మారింది. ఇక ఐపీఎల్ లీగ్.. క్రికెట్ అభిమానులకు ఇచ్చే జోష్ అంతా ఇంతా కాదు.
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్. ఐపీఎల్ వేలం మొదలు.. లీగ్ ముగిసే వరకు సంబరమే. ఈ లీగ్ క్రికెట్ ప్లేయర్లకు కాసుల పంట పండిస్తుంది. స్టార్ ప్లేయర్లు మొదలు.. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న యువ క్రికెటర్ల వరకూ అందరికీ అదృష్ట రేఖగా మారింది. ఇక ఐపీఎల్ లీగ్.. క్రికెట్ అభిమానులకు ఇచ్చే జోష్ అంతా ఇంతా కాదు. లీగ్ మ్యాచ్‌లో భారీ సిక్సర్లు, ఫోర్ల బాదుతూ క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు ప్లేయర్లు. ఒక్కో ఫ్రాంఛైజీలుకి ఒక్కో జట్టు ఉన్నట్లే.. చీర్ లీడర్స్ కూడా ఉంటారు. ఇక అభిమానుల్లో జోష్ పెంచే ప్లేయర్లు అయితే, ఆ ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపేది చీర్ లీడర్స్. ఒక మ్యాచ్‌లో చీర్ లీడర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. వారు స్టెప్పులు, వారు చేసే సందడి అటు ఆడే ప్లేయర్స్‌లో.. ఇటు ప్రేక్షకుల్లో మరింత జోష్ నింపుతుంది. తమ డ్యాన్స్‌తో అందరినీ కనువిందు చేస్తారు.
తమ బ్యాటింగ్, బౌలింగ్‌తో రెచ్చిపోయే ప్లేయర్లకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఫ్రాంఛైజీలు.. వారిలో జోష్ పెంచే చీర్‌లీడర్స్‌కి కూడా భారీగా మొత్తంలో పారితోషికం చెల్లిస్తాయి. అయితే, వీరికి ఒక్కో మ్యాచ్ లెక్కన డబ్బులు చెల్లిస్తారు. మరి చీర్‌లీడర్స్‌కు ఏ ఫ్రాంఛైజీ ఎంత చెల్లిస్తుంది? వంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయా ఫ్రాంఛైజీలు ఐపీఎల్ చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ. 12 వేల నుంచి రూ. 17 వేల వరకు చెల్లిస్తాయట. అయితే, అన్నింటికంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ చీర్‌లీడర్స్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ తన చీర్‌లీడర్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 24 వేలు పారితోషకం ఇస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్‌లీడర్స్‌కు మ్యాచ్‌కు రూ. 12 వేలు ఇస్తుండగా.. ముంబై ఇండియన్స్ తన చీర్‌లీడర్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున చెల్లిస్తోంది. ఆర్సీబీ సైతం రూ. 20 వేలు ఇస్తోంది. అంతేకాదు.. వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
చీర్‌లీడర్స్ సెలక్షన్స్..
ఎంటర్టైనర్స్‌గా చీర్‌లీడర్స్ అందరినీ ఆకర్షిస్తుంటారు గానీ.. వారి ఎంపిక అంత ఈజీగా ఏం జరుగదట. మంచి డ్యాన్సర్లు, మోడలింగ్ రంగంలో ఉండి ప్రతిభావంతులైన వారిని అనేక దఫాలుగా పరీక్షించిన తరువాత చీర్‌లీడర్స్‌గా ఎంపిక చేస్తారట.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..