AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లగా కనిపించిన షాకింగ్ సీన్.. పోలీసుల ఎంట్రీతో..

డబ్బు.. డబ్బు.. డబ్బు.. మనిషి పరుగంతా డబ్బు కోసమే. కష్టపడి సంపాదించడం వల్ల ఎదగలేమని భావించే కొందరు వ్యక్తులు.. అత్యాశతో పురాతన సంపదపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ సంపద కోసం పురాతన ఆలయాలనే టార్గెట్‌గా పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు.

Telangana: పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లగా కనిపించిన షాకింగ్ సీన్.. పోలీసుల ఎంట్రీతో..
Ancient Temple
Shiva Prajapati
|

Updated on: Apr 09, 2023 | 1:57 PM

Share

డబ్బు.. డబ్బు.. డబ్బు.. మనిషి పరుగంతా డబ్బు కోసమే. కష్టపడి సంపాదించడం వల్ల ఎదగలేమని భావించే కొందరు వ్యక్తులు.. అత్యాశతో పురాతన సంపదపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ సంపద కోసం పురాతన ఆలయాలనే టార్గెట్‌గా పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. పురాతన గుడి కనిపిస్తే చాలు.. నిధుల కోసం తవ్వేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా గుప్త నిధుల కోసం పురాతన ఆలయం లోపల గుంతలు తవ్విన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజిపేట గ్రామశివారులో కాకతీయరాజులు నిర్మించిన పురాతన రంగనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల మూడు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు భారీ గొయ్యి తవ్వారు. గ్రామానికి చెందిన కొంతమంది ఆ పక్కనే నూతనంగా నిర్మించిన ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉనన పురాతన ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే, ఆలయంలో గుంతలు తవ్వినట్లు కనిపించింది. దాంతో విసయాన్ని గ్రామస్తులందరికీ తెలుపగా.. గ్రామ పెద్దలకు పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..