Congress: కాంగ్రెస్ పార్టీకు కొత్త జోష్.. సార్వత్రిక ఎన్నికలకు పొత్తు ఖాయం చేసుకున్న రెండు పార్టీలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ రెండు పార్టీలు కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ నిర్ణయం ప్రకటించవచ్చు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రాహుల్‌గాంధీ. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో కీలకభేటీ జరిగింది. బీహార్ సీఎం నితీష్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌తో భేటీ అయ్యారు ఖర్గే,రాహుల్‌గాంధీ. ఈ సమావేశంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్, జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్, బీహార్ ప్రభుత్వ మంత్రి సంజయ్ ఝా కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నితీష్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యనతు సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలను ఎలా ఏకం చేయాలనే అంశంపై చర్చలు జరిగాయి. కొన్ని పార్టీలతో చర్చలు జరిపే బాధ్యత నితీష్ కుమార్ కు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ అనంతరం నేతలంతా కలిసి పీసీ చేశారు.
బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ముగ్గురు నేతలన్నారు. ఈనెల చివరివారంలో ఢిల్లీలో విపక్షాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి. విపక్షనేతలతో ఖర్గేతో పాటు నితీష్ సంపద్రింపులు జరపబోతున్నారు. విపక్షాలన్నీ ఏకం కావాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు రాహుల్‌గాంధీ. ఒక విజన్‌తో విపక్షాలు ముందుకెళ్తాయని , తప్పకుండా కలిసి పోరాటం చేస్తాయన్నారు రాహుల్‌గాంధీ. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చారిత్రాత్మకమైన చర్య తీసుకున్నామని.. ఇది ఒక ప్రక్రియ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం పట్ల ప్రతిపక్షాలకు ఉన్న దృక్పథాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతిపక్షాలన్నింటిని మా వెంట తీసుకెళ్తాం, ప్రజాస్వామ్యం, దేశంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడతాం.
దేశవ్యాప్తంగా విపక్షలన్నీ తప్పకుండా ఏకమవుతాయన్నారు బీహార్ సీఎం నితీష్‌కుమార్ . అన్ని విపక్ష పార్టీలతో సంప్రదింపులు ముగిశాయన్నారు. దేశవ్యాప్తంగా మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలి. భవిష్యత్తులో కలిసి పని చేయాలని నిర్ణయించారు.
#WATCH | This is a historic step to unite the opposition. We will develop the vision of the opposition parties and move forward; we will all stand together for the country: Congress leader Rahul Gandhi pic.twitter.com/S5iEupslzL
— ANI (@ANI) April 12, 2023
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈరోజు ఇక్కడ చారిత్రాత్మకమైన సమావేశం జరిగిందని, పలు అంశాలపై చర్చించామన్నారు. అన్ని (ప్రతిపక్ష) పార్టీలను ఏకం చేసి రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని ప్రకటించారు మల్లిఖార్జున్ ఖర్గే.
మరిన్ని జాతీయ వార్తల కోసం




