Instant Energy Foods: ఎండ తీవ్రత వల్ల నీరసంగా అనిపిస్తోందా? తక్షణ శక్తినిచ్చే ఆహారాలు ఇవే..
వేసవిలో ఎండ తీవ్రవల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో నిస్సత్తువగా, నీరసంగా అనిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో తక్షణం శక్తి కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పోషలకాలు పుష్కలంగా ఉండే కొన్ని రకాల ఆహారాలను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Apr 11, 2023 | 2:45 PM

వేసవిలో ఎండ తీవ్రవల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో నిస్సత్తువగా, నీరసంగా అనిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో తక్షణం శక్తి కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పోషలకాలు పుష్కలంగా ఉండే కొన్ని రకాల ఆహారాలను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా, బియ్యంతో వండిన అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

గుడ్లు, గింజలు, చీజ్, లీన్ మీట్ వంటి ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

డ్రై ఫ్రూట్స్, అవకాడో, చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి.

పాలకూర, కాయధాన్యాలు, రెడ్ మీట్, టోఫు.. ఇతర ఆహారాల్లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో అలసటను నివారించి, తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి.





























