కెనడా దేశంలోని యుకాన్లో ఉన్న బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా ఓ వింత ఆకారం బయటపడింది. 2018లో బయటపడ్డ ఆ వింత ఆకారం ఏంటో ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ వింత ఆకారం బంగారు గనుల్లో తవ్వకాలు జరిపిన అధికారులు లభ్యమైంది. దీనిని ల్యాబ్కు తీసుకెళ్లి పలు రీసెర్చ్లు నిర్వహించి అదేంటో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. దానికి ఎక్స్రే తీయగా.. అది ఆర్కిటిక్ గ్రౌండ్ ఉడుతగా తేల్చారు. 30 వేల ఏళ్ల క్రితం నాటిదని.. అలాగే ఆ ఉడుత మరణించేనాటికి ఒక్క సంవత్సరం అయ్యి ఉండొచ్చునని అంచనా వేశారు. కాగా, అలస్కాన్ బోర్డర్ సమీపంలో ఉండే క్లోన్డైక్ బంగారు గనులు ఉన్న ప్రాంతమంతటా కొన్ని ఏళ్లుగా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుందని.. గతంలోనూ ఈ చోట వేల ఏళ్ల నాటి తోడేళ్లు, మమూత్ మృతదేహాలు దొరికాయని శాస్తవేత్తలు చెప్పుకొచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..