Save Your Hearing : మీ చెవులు సరిగా వినిపించడం లేదా? ఇలా చేస్తే వినికిడి సామర్థ్యం పెరుగుతుంది..!

చాలా మంది వ్యక్తులు వారి వయస్సు పెరిగే కొద్ది వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అయితే, మరికొందరు తమ వినికిడి సామర్థ్యంపై శ్రద్ధ చూపరు. కానీ, మన ప్రతిచర్య, చేసే పని, గమనించే విధానం, ఇతరులతో కనెక్ట్ అయ్యే విధానంలోనూ వినికిడి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వినికిడి అనేది అభిజ్ఞా పనితీరు, మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది. వినికిడి లోపం చిత్తవైకల్యం,

Save Your Hearing : మీ చెవులు సరిగా వినిపించడం లేదా? ఇలా చేస్తే వినికిడి సామర్థ్యం పెరుగుతుంది..!
Hearing
Follow us

|

Updated on: Jun 03, 2023 | 7:30 AM

చాలా మంది వ్యక్తులు వారి వయస్సు పెరిగే కొద్ది వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అయితే, మరికొందరు తమ వినికిడి సామర్థ్యంపై శ్రద్ధ చూపరు. కానీ, మన ప్రతిచర్య, చేసే పని, గమనించే విధానం, ఇతరులతో కనెక్ట్ అయ్యే విధానంలోనూ వినికిడి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వినికిడి అనేది అభిజ్ఞా పనితీరు, మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది. వినికిడి లోపం చిత్తవైకల్యం, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. వినికిడి అనేది మన జీవితంలో అంతర్భాగం, సంభాషణలను ఆస్వాదించడానికి, సంభాషణల్లో చురుకుగా పాల్గొనడానికి సహాయపడుతుంది. సంగీతం వినడానికి, సినిమాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడం, అలర్ట్ చేయడంలో కీలకంగా ఉంటుంది వినికిడి వ్యవస్థ.

కారణాలు అనేకం..

వినికిడి లోపానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వృద్ధాప్యం నుంచి అనారోగ్యం వరకు అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. ‘వయస్సు, అతి శబ్దం, జన్యుపరమైన అంశాలు, అనారోగ్యం, నాడీ సంబంధిత రుగ్మతలు, మందులు, రసాయనాలు, శారీరక గాయాలు, న్యూరోబయోలాజికల్ కారకాలతో సహా వినికిడి లోపానికి దారితీసే వివిధ కారణాలు ఉన్నాయి. శుభవార్త ఏంటంటే.. 50 శాతం వరకు వినికిడి లోపం, చెవుడును నివారించే అవకాశం ఉంది’ అని వైద్యులు చెబుతున్నారు.

వినికిడిని మెరుగుపరచడానికి జీవనశైలి మార్పులు..

1. మంచి ఆహారం..

ఇవి కూడా చదవండి

B12 అధికంగా ఉన్న ఆహారం వినికిడి సమస్యలను తగ్గిస్తుంది. అయితే కొవ్వు, ఐరన్, కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావం చూపుతుంది. విటమిన్ డి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా వినికిడి సమస్యలు తగ్గుతాయి.

2. తేలికపాటి వ్యాయామం చేయాలి..

వ్యాయామం అనేక రకాల సమస్యల నుంచి కాపాడుతుంది. వయస్సు-సంబంధిత వినికిడి లోపం నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, అతిగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.

3. ధూమపానం మానుకోవాలి..

అధ్యయనాల ప్రకారం.. ధూమపానం కూడా వినికిడి లోపాన్ని కలిగిస్తుంది. సిగరెట్లకు దూరంగా ఉండాలి.

4. తగినంత నిద్రపోవాలి..

నిద్ర లేకపోవడం, శారీరక, మానసిక ఆరోగ్యం కూడా వినికిడి సమస్యపై ప్రభావం చూపుతుంది. అందుకే, శరీరానికి అవసరమైనంత నిద్రపోవాలి.

5. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి..

వినికిడి లోపానికి ప్రధాన కారణంగా అధిక శబ్ధం. చాలా మంది గంటలు గంటలు హెెడ్‌ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని, పెద్ద శబ్ధంతో పాటలు వింటుంటారు. ఇలా చేస్తే మీ చెవుల వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా, నిర్మాణ ప్రదేశాలు, నైట్‌క్లబ్‌లు వంటి పెద్ద శబ్దం ఉన్న వాతావరణంలో చెవుల్లో దూది వంటి రక్షణ వస్తువులను ధరించాలి.

6. రెగ్యులర్ పరీక్షలు..

సంవత్సరానికి కనీసం ఒకసారి వినికిడి పరీక్షను చేయించుకోవాలి. వినికిడి లోపం శాశ్వతంగా నష్టపోకముందే.. కారణాలను నిర్ధారించుకుని, సమస్య నుంచి బయటపడొచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..