WhatsApp: బీ అలర్ట్.. ఈ లింక్‌పై క్లిక్ చేశారో.. మీ వాట్సాప్ ఆ క్షణమే ఎగిరిపోతుంది..!
వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒకటి. వినియోగదారుకు మంచి అనుభూతిని కల్పించేందుకు, భద్రతను రెట్టింపు చేసేందుకు నిరంతరం అనేక కొత్త కొత్త ఫీచర్లను, సెక్యూరిటీ ఆప్షన్స్ తీసుకువస్తుంది వాట్సాప్. యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మెరుగుపరచడానికి, ఫీచర్‌లను యాడ్ చేయడానికి,
వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒకటి. వినియోగదారుకు మంచి అనుభూతిని కల్పించేందుకు, భద్రతను రెట్టింపు చేసేందుకు నిరంతరం అనేక కొత్త కొత్త ఫీచర్లను, సెక్యూరిటీ ఆప్షన్స్ తీసుకువస్తుంది వాట్సాప్. యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మెరుగుపరచడానికి, ఫీచర్‌లను యాడ్ చేయడానికి, గోప్యతను మెరుగుపరచడానికి, బగ్‌లను పరిష్కరించడానికి వాట్సాప్.. నిరంతరం యాప్‌కి అప్‌డేట్‌లను ఇస్తుంది. అయినప్పటికీ, తాత్కాలిక సమస్యల కారణంగా వాట్సాప్ వినియోగదారులు సేఫ్‌గా లేరు. ఇటీవలి ఓ బగ్ వాట్సాప్ యూజర్లను కలవరపెడుతోంది. ఆ బగ్.. ఆండ్రాయిడ్ యాప్‌ను క్రాష్ చేసింది.
సమాచారం ప్రకారం.. వాట్సాప్‌లో ఒక బగ్ రన్ అవుతోంది. దీని కారణంగా వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ క్రాష్ అవుతుంది. వినియోగదారులు wa.me/settings అనే ప్రత్యేక లింక్‌ని కలిగి ఉన్న గ్రూప్ చాట్‌ని తెరిచినప్పుడు బగ్ ట్రిగ్గర్ చేయబడుతుంది. సాధారణంగా, ఈ లింక్ WhatsApp సెట్టింగ్‌ల పేజీని తెరవాలి. కానీ ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో క్రాష్‌లకు కారణమవుతోంది.
బగ్‌ను గుర్తించిన వాట్సాప్..
ఈ లింక్‌తో చాట్‌ను తెరవడం వలన వాట్సాప్ క్రాష్ అవుతుంది. అయితే యూజర్లు నిర్దిష్ట మెసేజ్ థ్రెడ్‌ని మళ్లీ ఓపెన్ చేయకపోతే.. కొంత సమయం తర్వాత యాప్ రీస్టార్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ WhatsApp 2.23.10.77ని బగ్ ప్రభావితం చేస్తోంది. ఇతర వెర్షన్‌లను కూడా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ బగ్‌ను మొదటిసారిగా ట్విట్టర్ యూజర్ @pandyaMayur11 రిపోర్ట్ చేశారు. ఆ తరువాత బగ్‌ను మిగతావారు సైతం గుర్తించడంతో చర్చనీయాంశంగా మారింది.
Don’t send this message(https://t.co/wKuoDv7bMr) to anyone chat.otherwise it will Crash WhatsApp(happened only in Android)if already send it than use WhatsApp web or desktop application to delete this.@WhatsApp @Meta #whatsappcrash #wamesettings #meta #bug pic.twitter.com/y0QATSWHiO
— PandyaMayur (@pandyaMayur11) May 25, 2023
పరిష్కారమెలా?
మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. సులువైన పరిష్కారం ఉంది. వాట్సాప్ బ్రౌజర్ వెర్షన్, వాట్సాప్ వెబ్, ఈ బగ్ బారిన పడలేదు. మీరు మీ బ్రౌజర్ ద్వారా వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అవ్వవచ్చు. క్రాష్ అయిన సందేశాన్ని లేదా చాట్‌ను తొలగించవచ్చు. ఆ తర్వాత, ఆ సమస్యాత్మక లింక్ మళ్లీ రానంత వరకు ఫోన్‌లో వాట్సాప్ క్రాష్ అవదు. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..