- Telugu News Photo Gallery Beauty Tips: If you use an ice cube like this, all eyes will be on you! Try and see know here details
Beauty Tips: ఐస్ క్యూబ్‌తో ఫేస్‌పై ఇలా చేయండి.. చూపు తిప్పుకోలేని అందం సొంతం చేసుకోండి..!
చల్ల చల్లని ఐస్‌క్యూబ్‌తో బోలెడు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఐస్ క్యూబ్‌ని చర్మంపై అప్లై చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అవాక్కవుతారు.
Updated on: Jun 01, 2023 | 6:30 AM

మెత్తని కాటన్ క్లాత్ లో 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రంగా మారుతుంది. మొటిమలు రావు. ఐస్ ప్యాక్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

రోజూ చర్మంపై ఐస్ క్యూబ్స్ మసాజ్ చేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ప్రతిరోజూ ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.

ప్రతిరోజూ ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ముఖం మెరిసిపోవడానికి ప్రతిరోజూ ఐస్ క్యూబ్ ఉపయోగించొచ్చు.

చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడానికి ఇది ఒక అద్భుతమై మార్గం. దీని వల్ల ముఖానికి రక్తప్రసరణ సాఫీగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది.

కలబంద, తులసి కూడా చర్మం అందాన్ని కాపాడానికి మేలు చేస్తాయి. వీటిని కూడా ఐస్ క్యూబ్స్‌కి అప్లై చేసి చర్మంపై మసాజ్ చేయొచ్చు.





























