- Telugu News Photo Gallery IPL 2023 Sets Highest Run Record and Six's, Fours and Wickets, Know More Detains
IPL 2023: 74 మ్యాచ్‌ల్లో పరుగుల సునామీ.. ఫోర్స్, సిక్సర్ల అయితే లెక్కలేదు.. ఐపీఎల్ సీజన్ 16 లెక్క ఇదీ!
IPL 2023 Records: ఐపీఎల్ సీజన్ 16లో సూపర్ సూపర్ రికార్డ్స్ నమోదు అయ్యాయి. అత్యధిక సెంచరీలు, అత్యధిక స్కోర్, ఇలా అన్నింట్లోనూ సరికొత్త రికార్డ్ నమోదైంది. మరి ఆ రికార్డ్స్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 01, 2023 | 6:37 AM

IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ ఎన్నో రికార్డులకు సాక్షిగా నిలిచింది. అత్యంత ముఖ్యమైన రికార్డులలో ఒకటి అత్యధిక పరుగులు. ఈసారి ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పరుగుల వర్షం కురిసింది.

ఈ ఐపీఎల్‌లో మొత్తం 1,124 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది గతంలో కంటే ఎక్కువ. అంటే ఐపీఎల్ 2022లో 1062 సిక్సర్లు కొట్టడం ఇప్పటి వరకు రికార్డు. ఇక 74 మ్యాచ్‌ల్లో మొత్తం 2,172 ఫోర్లు కొట్టారు ప్లేయర్స్.

ఈ సీజన్‌లో మొత్తం 106 సార్లు రికార్డ్ అయ్యాయి. అంతే కాదు, ఈ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదేశారు ఆటగాళ్లు. 2022లో 8 సెంచరీలతో రికార్డ్ సృష్టించగా.. ఈసారి 12 సెంచరీలు నమోదయ్యాయి.

అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించారు ఆటగాళ్లు. ఐపీఎల్ 2023లో మొత్తం 153 అర్ధ సెంచరీలు కొట్టేశారు. గత సీజన్‌లో 118 అర్ధశతకాలు సాధించారు.

ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల్లో 24 వేలకు పైగా పరుగులు చేశారు ప్లేయర్స్. 2022లో మొత్తం 23,052 పరుగులు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది.

ఈసారి బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో 74 మ్యాచ్‌ల్లో మొత్తం 24,428 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇదే కావడం విశేషం.





























