- Telugu News Photo Gallery South Indian Tourist Places: You can visit these places of Southern India to have a good time in Summer Holidays
Tourist Places: వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలా..? దక్షిణ భారతంలోని మనసు దోచే ప్రదేశాలివే.. సందర్శిస్తే ఎన్నో జ్ఞాపకాలు..
Tourist Places: వెకేషన్ కోసం దక్షిణ భారతదేశాన్ని చుట్టి రావాలనుకుంటున్నారా? దక్షిణాది రాష్ట్రాలలో ప్రకృతి అందాలు, బీచ్ అందాలు, కొండకోనలు, పచ్చని వాతావరణం కలిగిన ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు ఈ వేసవి సెలవులలో సందర్శించి జ్ఞాపకాలలో పొందుపరుచుకోవచ్చు.
Updated on: Jun 01, 2023 | 9:27 AM

వేసవి సెలవులను గడపేందుకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలు దక్షిణ భారతంలో ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో మీరు బీచ్ అందాలు, పచ్చదనం, జలపాతం వంటివి చూడవచ్చు. అవి మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి వాటిలో కొన్ని ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం..

అలప్పుజ: కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన అలప్పుజను అలెప్పి అని కూడా అంటారు. ఇక్కడ మీరు పచ్చని వాతావరణంలో కొంత విలువైన సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు.

కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడి కాఫీ, టీ తోటల అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు ఇక్కడ ఉండే అందమైన సరస్సు, జలపాతాలు, పచ్చికభూములను తప్పక ఇష్టపడతారు.

కొడైకెనాల్: కొడైకెనాల్ తమిళనాడులో ఉన్న చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఉండే మేఘాలతో చుట్టుముట్టి ఉన్న కొండలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. కొడైకెనాల్ మీ భాగస్వామితో వెళ్లేందుకు అనుకూలమైన అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.

వాయనాడ్: కేరళలోని వాయనాడ్‌లో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మీరు వాయనాడ్‌లో స్థానికంగా ఉన్న ఎన్నో సందర్శనా స్థలాలకు వెళ్లవచ్చు. ఇంకా ఇక్కడ వెదురు రాఫ్టింగ్, ట్రెక్కింగ్, బోటింగ్, జంగిల్ సఫారీ, జిప్‌లైనింగ్ వంటివి కూడా ఉన్నాయి.




