Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Boiling Tips: గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అవ్వండి..

రెండు మూడు నిమిషాలు ఉడకబెడితే సరిపోదు.. అలా చేస్తే అంతా పచ్చిగానే ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాల్లో దాదాపుగా గుడ్డు పూర్తిగా ఉడికిపోతుంది. కావాలంటే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసుకోవటం కూడా మంచిది. గుడ్లు ఉడికించినప్పుడు నీటిలో వెనిగర్ వేస్తే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి.

Egg Boiling Tips: గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అవ్వండి..
Egg Boiling
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 02, 2023 | 6:09 PM

ఉడకబెట్టిన గుడ్లను తినే అలవాటు ఉందా..? అయితే, ఉదయం పూట ఉడకబెట్టిన గుడ్లను తింటే శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి. కోడి గుడ్డు తినేవారిలో వారి కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది.. పచ్చసోనలో అధిక పోషకాలు ఉంటాయి. గోళ్ల ఆరోగ్యానికి కూడా గుడ్డు చాలా మంచిది. ఉడికించిన గుడ్డులో సల్ఫర్ అధిక స్థాయిలో ఉంటుంది. విటమిన్ డి పొందాలంటే గుడ్డు ప్రతిరోజూ తినడం చాలా మంచిది. గోళ్ల పెరుగుదలకు బాయిల్డ్ ఎగ్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, చాలా వరకు గుడ్లు ఉడికించే క్రమంలో అవి మధ్యలో పగిలిపోవడం లేదంటే తెల్లసొన బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా గుడ్డు మధ్యలో పగిటిపోకుండా పూర్తిగా ఉడకాలంటే చేం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే, ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న గుడ్లను ఫ్రిజ్ లో పెడుతుంటారు చాలా మంది. అలా ఫ్రిజ్లో నుంచి తీసిన గుడ్లను వెంటనే నేరుగా ఉడికించేస్తారు. కానీ, ఇలా చేయటం వలన గుడ్లు పగిలిపోతాయి. అందుకోసం.. ఫ్రిజ్ నుంచి తీసిన గుడ్లను కాసేపు అలాగే, బయట పెట్టాలి. అవి సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చాక అప్పుడు ఉడికించాలి. ఇలా చేస్తే గుడ్లు పగలకుండా సాఫీగా ఉడుకుతాయి.

గుడ్డు సరిగా ఉడకడం అంటే బయట ఎగ్ వైట్, లోపల యోల్క్, రెండూ గట్టిగా ఉండాలి. రెండు మూడు నిమిషాలు ఉడకబెడితే సరిపోదు.. అలా చేస్తే అంతా పచ్చిగానే ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాల్లో దాదాపుగా గుడ్డు పూర్తిగా ఉడికిపోతుంది. కావాలంటే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసుకోవటం కూడా మంచిది. గుడ్లు ఉడికించినప్పుడు నీటిలో వెనిగర్ వేస్తే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..