Trending News: యువ రైతు పెళ్లి ఊరేగింపు.. భలే కొత్తగా ఆలోచించారు భయ్యా? అందరూ ఫిదా..
జీవితంలో ఒకేసారి చేసుకునే ఒక మధురమైన జ్ఞాపకం కావడంతో పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి కాలంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది ఒక జంట పెళ్లి. ఈ మధ్య కాలంలో పెళ్లి తర్వాత డీజే, డ్యాన్స్ సర్వసాధారణమైపోయాయి. ఈ ఆధునిక వేషధారణల మధ్య పాత సంప్రదాయాలను వదిలేశాం. అయితే ఇక్కడ ఓ యువ రైతు తన వివాహాన్ని దశాబ్దాల నాటి సంప్రదాయంగా చేసుకున్నాడు.
ఎవరింట్లోనైనా పెళ్లి అంటే ఆడంబరం ఉంటుంది. పెళ్లి తంతూ ఆరంభం నుంచి పెళ్లి, రిసెప్షన్ వరకు ప్రతి ఫంక్షన్ సంప్రదాయబద్ధంగా కాకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి ఇంట్లో డబ్బుకు బదులు సందడి పెరిగిపోతుంది. ఒకప్పుడు పెళ్లికి ఐదు, ఆరు వేలు ఖర్చయ్యేది.. కానీ, ఇప్పుడా ఖర్చు లక్షలు, కోట్లకు చేరింది. ప్రస్తుతం పెళ్లి వేడుక అనేది ప్రెస్టెజ్ ఇష్యూగా మారింది. జీవితంలో ఒకేసారి చేసుకునే ఒక మధురమైన జ్ఞాపకం కావడంతో పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి కాలంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది ఒక జంట పెళ్లి. ఈ మధ్య కాలంలో పెళ్లి తర్వాత డీజే, డ్యాన్స్ సర్వసాధారణమైపోయాయి. ఈ ఆధునిక వేషధారణల మధ్య పాత సంప్రదాయాలను వదిలేశాం. అయితే ఇక్కడ ఓ యువ రైతు తన వివాహాన్ని దశాబ్దాల నాటి సంప్రదాయంగా చేసుకున్నాడు. హుబ్లీలో జరిగినఈ పెళ్లి వేడుక సోషల్ మీడియా వేదికగా అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి రోజు రాత్రి జరిగిన నవ దంపతుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందంగా అలంకరించిన చక్కటి ఎద్దుల బండిపై వధూవరులను పట్టణంలో ఊరేగించారు.
ప్రవీణ్ ఓ రైతు కొడుకు, పాత సంప్రదాయాన్ని ఉట్టిపడేలా మోడ్రన్ డీజే, డ్యాన్స్‌ని వదిలిపెట్టి ఇలాంటి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాడు. ఈ యువకుడి ఆలోచనకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు కురిపిస్తన్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..