Viral News: ఆరో అంతస్తు నుంచి కిందపడ్డ పెంపుడు పిల్లి..! యజమానికి భారీ జరిమానా.. ఏం జరిగిందంటే..

ఈ ఘటనలో పెంపుడు పిల్లి యజమాని చెప్పిన వివరాల మేరకు.. ఆ పిల్లి ఇంటి బాల్కనీ గోడపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లికి కొద్దిగా గాయాలు అయ్యాయని, కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. తన మేనేజర్ తనకు ఫోన్ చేసి కారు మీద పిల్లి పడిందని చెప్పాడు. అయితే,

Viral News: ఆరో అంతస్తు నుంచి కిందపడ్డ పెంపుడు పిల్లి..! యజమానికి భారీ జరిమానా.. ఏం జరిగిందంటే..
Cat Falls From 6th Floor
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 02, 2023 | 5:44 PM

సాధారణంగా జంతుప్రేమికులు చాలా మంది కుక్కలు, పిల్లలు వంటివి ఎక్కువగా పెంచుకుంటుంటారు. వారి ఇంట్లో వాటిని తమ పిల్లలతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ పెంపుడు పిల్లి అనుకోకుండా ఆరో అంతస్తు నుంచి జారి కింద పడింది. కానీ, దానికి ఎలాంటి హాని కలుగలేదు. అది ఆరో అంతస్తు నుంచి జారి పార్కింగ్ లో ఉన్న ఓ కారు మీద పడింది. దాంతో కారు అద్దం పగిలి, పిల్లి కారు సీటుపై పడింది. దీంతో పిల్లికి ఏమీ కాలేదు.. కానీ కారు అద్దం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కారు యజమాని సోషల మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటనలో పెంపుడు పిల్లి యజమాని చెప్పిన వివరాల మేరకు.. ఆ పిల్లి ఇంటి బాల్కనీ గోడపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లికి కొద్దిగా గాయాలు అయ్యాయని, కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. తన మేనేజర్ తనకు ఫోన్ చేసి కారు మీద పిల్లి పడిందని చెప్పాడు. అయితే, ఆ పిల్లి బరువు 8.5 కేజీలు మాత్రమే ఉండటంతో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. కానీ కారు అద్దం మాత్రం పగిలింది అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే, తన కారుకు డ్యామేజ్ అయినప్పటికీ, అది కావాలని చేసిన డ్యామేజ్ కాకపోవడంతో తనకు కోపం రాలేదని ప్రశాంతంగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ అపార్ట్మెంట్ లో పెంపుడు జంతువులకు అనుమతి లేదట. కానీ ఓ కుటుంబం ఎవరికీ తెలికుండా ఆ పిల్లిని పెంచుకుంటోంది. ఇప్పుడు ఈ ఘటనతో పిల్లి విషయం బయటపడింది. దీంతో, ఆ కుటుంబానికి ఆ ఇంటి యజమాని జరిమానా విధించాడు.

మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!