మీరు మీ ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తున్నారా..? అది మీ ప్రాణాలకు ముప్పు..బీ కేర్‌ఫుల్..
ఈ పద్ధతి సౌకర్యవంతంగా అనిపించినా.. ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఇలా ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని గంటల తరబడి లాప్ టాప్ వాడటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ల్యాప్ ట్యాప్ వాడేవారు కొన్ని జాగ్రత్తలను పాటించటం ముఖ్యం. వాటి గురించి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ లాప్ ట్యాప్ వాడుతున్నారు. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోమ్, Online క్లాస్ లు బాగా పెరిగిపోయాయి. దీంతో చిన్న పెద్దా అనే తేడా లేకుండా గంటల తరబడి లాప్ ట్యాప్ వాడవలసి వస్తుంది. ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని లాప్ ట్యాప్ వాడే సౌలభ్యం ఉండటం వల్ల ప్రతిఒక్కరూ డెస్క్ టాప్ కంటే, లాప్ ట్యాప్ అంటే ఇష్టపడుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత, చాలా మంది ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. చాలా కంపెనీలు తమ సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తూనే ఉన్నాయి. అలాగే, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ఇష్టపడతారు. ఈ పద్ధతి సౌకర్యవంతంగా అనిపించినా.. ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఇలా ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని గంటల తరబడి లాప్ టాప్ వాడటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ల్యాప్ ట్యాప్ వాడేవారు కొన్ని జాగ్రత్తలను పాటించటం ముఖ్యం. వాటి గురించి తెలుసుకుందాం.
ఆఫీసులో పని వాతావరణం ఇంట్లో పని శైలికి చాలా భిన్నంగా ఉంటుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు వెళ్లేవారు డ్రెస్సింగ్ స్టైల్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఇంటి నుండి పని చేసే వ్యక్తులు వారికి నచ్చిన విధంగా ఉండవచ్చు. కొంతమంది కూర్చొని పని చేస్తే మరికొందరు మంచం మీద పడుకుని పని చేస్తారు. ఇలా చేయడం వల్ల వారికి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఇంటి నుండి పని చేయడం వల్ల కలిగే నష్టాలు..
బరువు పెరుగుట: ఇంటి నుండి పని చేయడం వల్ల మీ శారీరక శ్రమ తగ్గుతుంది. మీరు బరువు పెరిగేలా చేస్తుంది. గంటల తరబడి మంచం మీద కూర్చొని పని చేస్తే నడుము చుట్టూ కొవ్వు పెరుగుతుంది.
సోమరితనం: మంచం మీద పనిచేయడం లేదా పడుకుని పని చేయడం మిమ్మల్ని సోమరిగా చేస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
వెన్నునొప్పి : మీరు మంచం మీద కూర్చుని ల్యాప్‌టాప్‌లో పని చేస్తే, మీ తుంటి, వెన్ను నొప్పి రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు కుర్చీలో కూర్చుని పని చేయండి.
రోజంతా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేసేవారికి తొడ భాగంలో చర్మ సమస్యలు రావచ్చు. కొందరిలో ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది. కనుక ఒడిలో పెట్టుకోవద్దు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం