Viral Video: అందంగా ఉందని పాముకు ముద్దుపెట్టబోయింది.. ఊహించని షాక్‌తో యువతి ముచ్చట తీరిందిగా..!
ఆ సమయంలో పక్కనే ఉన్న మహిళ కూడా తన స్నేహితురాలిని కాపాడాలంటూ కేకలు వేసింది. ఇది చూసిన మిగతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పాము దాడికి గురైన మహిళను రక్షించేందుకు ప్రయత్నించారు. మహిళ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్‌లో పాము వీడియోలు చాలా ఉన్నాయి. కొన్ని వీడియోలు భయపెడుతున్నాయి. పాములు విషపూరితమైనవి. ప్రమాదవశాత్తు పాము కాటేస్తే ప్రాణాలు కొల్పోవాల్సింది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది ప్రాణభయం లేకుండా విషసర్పాలతో పోరుకు దిగుతున్నారు. సరీసృపాల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. పార్కుకు వెళ్లిన ఒక యువతి అక్కడ సిబ్బంది చేతిలో ఉన్న పామును చూసి సంతోషపడుతుంది. తమ చేతిలో ఉన్నది ప్రమాదకరమైన పాము అని తెలిసి కూడా అది కాటేయదని భావించింది. వెంటనే వేగంగా వెళ్లి దానిని ముద్దాడేందుకు ప్రయత్నించింది. ఇద్దరు గార్డులు పామును చేతిలో పట్టుకుని ఉండగా ఆమె ఒక్కసారిగా పాము దగ్గరకు చేరింది. ఇకా అంతే..పాము, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యువతి ముక్కు, నోటిని పట్టి లాగేసింది. అస్సలు ఊహించని ఘటనలో అందరూ షాక్‌లో ఉండిపోయారు.
ఒక్కసారిగా పాము కాటువేయటంతో యువతి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పక్కనే ఉన్న మహిళ కూడా తన స్నేహితురాలిని కాపాడాలంటూ కేకలు వేసింది. ఇది చూసిన మిగతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పాము దాడికి గురైన మహిళను రక్షించేందుకు ప్రయత్నించారు. మహిళ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Kissing a snake ? pic.twitter.com/6yboCzFZ9w
— CCTV IDIOTS (@cctvidiots) May 31, 2023
పాముకి ఎప్పుడూ స్వీయ-సంరక్షణ భావం ఉంటుంది. పాము ఎవరైనా బెదిరించినట్లు భావిస్తే, అది అర సెకను కూడా ఆలస్యం చేయదు. వెంటనే వారిపై దాడి చేస్తుంది. మనిషి లేదా జంతువు ఎవరినీ విడిచిపెట్టవు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి పాములతో సహా సరీసృపాలు, జంతువుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ట్విట్టర్ పేజీ ccvidiotsలో షేర్ చేయబడింది. దీన్ని ఇప్పటి వరకు 2.1 మిలియన్ల మంది వీక్షించారు. పామును ముద్దుపెట్టుకోవడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లేనని పలువురు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..