TS Formation Day: నవశకానికి ‘నవ’ వసంతాలు.. 21 రోజుల పాటు నివ్వెరపోయేలా దశాబ్ది వేడుకలు
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరుపనుంది ప్రభుత్వం. ఆవిర్భావ వేడుకల కోసం105 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై. మరోవైపు గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది బీజేపీ.
తెలంగాణ స్వప్నం సాకారమై జూన్ 2 తో తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధం అవుతోంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు…తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ… అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ…దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 2న ఉదయం 10 గంటలా 20 నిముషాలకు అసెంబ్లీ దగ్గర అమరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా ఉదయం 7:30 గంటలకు జెండా ఎగురవేస్తారు.
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరుపనుంది ప్రభుత్వం. ఆవిర్భావ వేడుకల కోసం105 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై. మరోవైపు గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది బీజేపీ. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోటకు వెళ్ళి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా…చారిత్రక గోల్కొండ కోటపై జూన్ 2న ఉదయం 7 గంటల 10 నిముషాలకు జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్ రెడ్డి. తెలంగాణ సాధన ఏ ఒక్కరివల్లో సాధ్యం కాలేదనీ, సకల జనుల సమైక్య పోరాటంతో, 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు.
మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీ గా ప్రజలు మమ్మల్నే ఆదరిస్తారంటుంన్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధకురాలు సోనియా గాంధీయేనని, పాలాభిషేకాలకు సిద్ధమౌతున్నారు. పదివేల మందితో హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సభకు చీఫ్ గెస్ట్ గా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ హాజరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..