Jugaad Video: డ్రైవరన్నా నువ్ సూపర్..! ప్రయాణికులను చల్లగా ఉంచడం కోసం భలే ప్లాన్ చేశావ్..
ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రజలు ఏమైనా చేస్తారు. కొందరు తమ కారుపై ఆవు పేడను పూస్తారు. కొందరు వాహనం పైకప్పు నిండా గడ్డిని పర్చి తరచూ నీటితో తడుపుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే ఒకటి కనిపించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక ఆటో డ్రైవర్ ఒక గొప్ప ఆలోచన చేశాడు. అదేంటో చూస్తే మీరు అతడి ఆలోచనకు ఫిదా అవ్వాల్సిందే..
ఎండ వేడిమికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. కానీ, దినసరి కూలీలు రెండు పూటలా కడుపు నింపుకోవటం కోసం ఎండ, వానలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు గంటల తరబడి ఎండలో పనిచేయడం వారికి తప్పనిసరి. అంతే కాదు, ఏసీలు, కూలర్లు కొనుక్కోలేని వారు సైతం ఎందరో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుగాడ్ ఆలోచనలు చేస్తుంటారు. కొందరు తమ కారుపై ఆవు పేడను పూస్తారు. కొందరు వాహనం పైకప్పు నిండా గడ్డిని పర్చి తరచూ నీటితో తడుపుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే ఒకటి కనిపించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక ఆటో డ్రైవర్ ఒక గొప్ప ఆలోచన చేశాడు. అదేంటో చూస్తే మీరు అతడి ఆలోచనకు ఫిదా అవ్వాల్సిందే..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఆటో వెనుక భాగంలో కూలర్ కనిపిస్తుంది. ఇదేదో కాస్త వింతగా అనిపించవచ్చు.. కానీ, ఆటో డ్రైవర్ మాత్రం అలాంటి ఫీటే చేశాడు. ఆటో డ్రైవర్‌కి గానీ, ప్రయాణికులకు గానీ వేడి తగలకుండా ఆటోకు వైట్ కలర్ కూలర్‌ని అమర్చాడు. ఈ అద్భుతమైన ఆలోచనను చూసి స్థానికులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
వైరల్ వీడియోని కబీర్ సెటియా (@kabir_setia) అనే వినియోగదారు ఇన్‌స్టాలో షేర్ చేశారు. వారం క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో, వినియోగదారులు వీడియోపై భిన్నమైన కామెంట్స్ చేయటం కొనసాగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..