ఏ పేరు లేనట్టు ఇవేం పేర్లురా నాయనా.. స్టుపిడ్ హోటల్ నుండి పాగల్ పాన్ షాప్ వరకు అన్నీ తమాషా దుకాణాలే..
మన దేశంలోని కొన్ని దుకాణాల ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఆ షాప్స్ పేర్లు చదివిన తర్వాత మీరు నవ్వును ఆపుకోలేరు. దాంతో మీ పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఎందుకంటే.. దుకాణం పేరే దానికి గుర్తింపు. ఈ గుర్తింపును కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు కొందరు తమ దుకాణాలకు విచిత్రమైన పేర్లను పెట్టారు. పాగల్ పాన్ భండార్ నుంచి బేవకూఫ్ హోటల్ వరకు...అన్నీ తమాషా పేర్లే.