AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యంలో హడలెత్తిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. అన్ని వయసుల వారిపై ఎటాక్‌.. లక్షణాలు ఇవే!

దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేము. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. COVID, RSV కేసులు తగ్గుతున్నప్పటికీ, HMPV అని పిలువబడే కొత్తరకం శ్వాసకోశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మార్చి ప్రారంభంలో..

అగ్రరాజ్యంలో హడలెత్తిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. అన్ని వయసుల వారిపై ఎటాక్‌.. లక్షణాలు ఇవే!
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2023 | 8:16 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గిపోవడంతో యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేము. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. COVID, RSV కేసులు తగ్గుతున్నప్పటికీ, HMPV అని పిలువబడే కొత్తరకం శ్వాసకోశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మార్చి ప్రారంభంలో యుఎస్‌లో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎమ్‌పివి) కి సంబంధించి 20 శాతం యాంటిజెన్ పరీక్షలు దాదాపు 11 శాతం పిసిఆర్ పరీక్షలు పాజిటివ్‌గా వచ్చాయి.. పీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రేటు మహమ్మారికి ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే 36 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఈ కేసుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, మేలో తగ్గడం ప్రారంభమైంది. అందుకే, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) గత వారం దేశవ్యాప్తంగా HMPV కేసుల పెరుగుదలను గుర్తించింది.

ఇకపోతే, ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి జలుబు లక్షణాలు ఉంటాయి. రెండు నుంచి ఐదు రోజుల వరకు లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులు వారంతట వారే రికవరీ అయ్యే అవకాశం ఉంది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. కరోనా వైరస్ మాదిరే ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందుతుంది.

ప్రస్తుతం, హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV)కి నిర్దిష్ట చికిత్స గానీ, సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అందువల్ల, నివారణకు ప్రాథమిక విధానం మంచి పరిశుభ్రతను పాటించటం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..