Watch Video: తగ్గేదేలే.. చీర కట్టి.. సన్‌గ్లాస్ పెట్టి.. ఏం డ్యాన్స్ చేసింది గురూ.. దటీజ్ ఆంటీ పవర్!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. పెద్ద వారు సైతం చిన్నవారు అయిపోతున్నారు. తమలోని ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెబుతున్నారు. తరగని జోష్‌తో దుమ్ము రేపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. దుమ్మురేపుతున్నారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మనతో మామూలుగా ఉండదు అంటూ..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. పెద్ద వారు సైతం చిన్నవారు అయిపోతున్నారు. తమలోని ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెబుతున్నారు. తరగని జోష్‌తో దుమ్ము రేపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. దుమ్మురేపుతున్నారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మనతో మామూలుగా ఉండదు అంటూ.. వీడియోలో రఫ్ఫాడించేసింది మరి! సంప్రదాయబద్దంగా చీర కట్టి.. ఫ్యాషన్ ఐకాన్‌గా సన్‌గ్రాసెస్ పెట్టి.. ఓ పాప్ సాంగ్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ కుమ్మేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహిళ కాస్త ఏజ్‌డ్‌గానే కనిపిస్తున్నా.. ఆమెలో ఎనర్జీ మాత్రం స్టిల్ సిక్స్‌టీన్ మాదిరిగా ఉంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా మెరిసిపోయింది. ఇక పాప్ సాంగ్ పెట్టుకుని వేసిన డ్యాన్స్ అదుర్స్ అనాల్సిందే. ఈ వయసులోనూ మైఖేల్ జాక్సన్ సిస్టర్ మాదిరిగా, స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఈ వీడియోను agent_tina_official పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లు.. అతి త్వరలోనే ఈమె చాలా పాపులర్ అవుతారంటూ కితాబిచ్చేస్తున్నారు. వయసు నెంబర్ మాత్రమే అని, ఆమెలో జోష్ నెక్ట్స్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఆంటీ ట్యాలెంట్‌ను చూసేయండి..




వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..