Viral News: క్రియేటివిటా.? పైత్యమా.? పాముతో ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంట్రా బాబూ..
మారుతోన్న కాలానికి అనుగుణంగా వివాహ వేడుకల్లోనూ మార్పులు వచ్చాయి. ఇందులో ప్రధానమైంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్. పెళ్లికి ముందే జంటలు కొండా కోనలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. సినిమాలను తలదన్నే రీతిలో షూట్స్ చేయించుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్స్, కొరియో గ్రాఫర్స్, మేకప్..
మారుతోన్న కాలానికి అనుగుణంగా వివాహ వేడుకల్లోనూ మార్పులు వచ్చాయి. ఇందులో ప్రధానమైంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్. పెళ్లికి ముందే జంటలు కొండా కోనలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. సినిమాలను తలదన్నే రీతిలో షూట్స్ చేయించుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్స్, కొరియో గ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్టులు కూడా అందుబాటులోకి వచ్చారు. అయితే అంతా బాగానే ఉన్నా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పేరుతో కొందరు చేస్తున్న పనులే ఇప్పుడు పిచ్చి పీక్స్‌కి చేరినట్లు కనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కొందరు చేస్తున్న పనులు నవ్వాలో, జాలి పడాలే అర్థం కావడం లేదు.
తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని ఫొటోలు చూస్తుంటే పిచ్చి పీక్స్‌కి చేరినట్లు స్పష్టమవుతోంది. వివేక్ అనే యూజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో షూట్ సంబంధిత ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఓ జంట ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఏకంగా పాము థీమ్‌నే ఉపయోగించుకున్నారు. ఆ ఫొటో షూట్ ద్వారా చిన్న కథను కూడా చెప్పే పయత్నం చేశారు. యువతికి అటుగా నడుస్తూ రాగా ఆమెకు పాము ఎదరవుతుంది. దీంతో ఆమె భయపడి పోయి రెస్క్యూ సర్వీసుకు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వుతాడు.
Pre Wedding Photoshoot ❤️
A Thread: ? pic.twitter.com/8vXpgTRMNK
— vivekk (@oyevivekk) May 27, 2023
అనంతరం పామును బాక్సులో వేసుకొని వెళ్తూ.. యువతిని ఫోన్ చేయమని సైగ చేస్తాడు. ఆ తర్వాత వారు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. ఈ జంటను పాము కలిపిందనే థీమ్‌తో ఫొటో షూట్‌ను నిర్వహించారు. అయితే క్రియేటివిటీ బాగానే ఉన్నా బతికున్న పామును ఫొటో షూట్ కోసం వాడడం కొందరికి కోపం తెప్పిస్తోంది. పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— vivekk (@oyevivekk) May 27, 2023
మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..