- Telugu News Photo Gallery Ambani Ancestral House: Have A Detailed Look At Mukesh Ambani’s 100 Year Old Ancestral House In Gujarat
Ambani Ancestral House: గుజరాత్‌లోని ముఖేష్ అంబానీ 100 ఏళ్ల పూర్వీకుల ఇల్లు.. సోమవారం మినహా పర్యాటకులు సందర్శించే వీలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరు భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగాంచింది. దేశం ప్రగతి పథంలో ప్రయాణిస్తు సమయంలో ఒక సాధారణ కంపెనీ దేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ధీరూభాయ్ అంబానీ ప్రారంభించారు. కాలక్రమంలోముఖేష్ అంబానీ ఈ కంపెనీని మరింత అభివృద్ధి చేశారు. అయితే ధీరూ భాయ్ అంబానీ ఎక్కడ పుట్టారో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు ముఖేష్ అంబానీ పూర్వీకుల ఇల్లు ఎక్కడ ఉంది. తెలుసుకుందాం..
Updated on: Jun 02, 2023 | 1:34 PM

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కుటుంబాల్లో అంబానీ కుటుంబం ఒకటి. ఈ కుటుంబం వ్యాపారానికే కాదు కుటుంబ విలువలకు కూడా పేరుగాంచింది.

విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన కార్లు, గడియారాలు, భిన్నత్వంలో ఏకత్వంలా సంప్రదాయం, ఆధునికతో కూడిన జీవనశైలి గురించి తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంబానీ కుటుంబం గురించి రోజుకో కొత్త విషయాలు ఒకటి తెరపైకి వస్తూనే ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ప్రజలు ఆ ఇంటిని చూడాలని చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే అంబానీ ఇంటిని లోపలి నుంచి చూడటం అందరికీ సాధ్యం కాదు. అయితే ముఖేష్ అంబానీ ఇల్లు చూడలేకపోయినా అంబానీ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటిని చూడవచ్చు.

అంబానీ కుటుంబం గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలోని చోర్వాడ్ గ్రామానికి చెందినది. ఇక్కడ శతాబ్దాలకు చెందిన పూర్వీకుల ఇల్లు ఉంది. 2002లో దీనిని అంబానీ కుటుంబం తమ ఆధీనంలోకి తీసుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు పునాది వేసిన ధీరూభాయ్ అంబానీ ఈ ఇంట్లోనే పుట్టారు. ఈ రెండు అంతస్తుల భవనం 2011లో స్మారక చిహ్నంగా మార్చబడింది.

అంబానీ కుటుంబానికి చెందిన ఈ పూర్వీకుల ఇల్లు కాలక్రమేణా అనేక నిర్మాణాత్మక మార్పులకు గురైంది. అయినప్పటికీ అసలు నిర్మాణశైలిలో మాత్రం మార్పులు చేర్పులు లేవు. ధీరూభాయ్ అంబానీ నివసించే స్థలం, చెక్క ఫర్నిచర్, ఇత్తడి-రాగి పాత్రలు, అనేక ఇతర ప్రదేశాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ కుటుంబం సాంస్కృతిక వారసత్వానికి ఈ ఇల్లు ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచింది.

ఈ భవనంలో కొంత భాగాన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో ముఖేష్ అంబానీ తాత జమ్నాదాస్ అంబానీ అద్దెకు తీసుకున్నారు. ఇందులో గుజరాత్ శైలి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భవన మధ్యలో ప్రాంగణం, వరండా సహా అనేక గదులతో నిర్మించబడింది.

అంబానీ కుటుంబానికి చెందిన ఈ పూర్వీకుల ఆస్తి 1.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. మూడు భాగాలుగా విభజించబడిన ఈ ఇంటి చుట్టూ పచ్చదనంతో నిండి ఉంటుంది. ఒక భాగం ప్రజల సందర్శనార్ధం తెరవబడింది. రెండవ భాగం ప్రైవేట్ కోకోనట్ పామ్ గ్రోవ్ . మూడవది ప్రైవేట్ ప్రాంగణం. ఇప్పుడు ఈ భవనం ప్రాంగణం రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం పూర్తిగా ప్రైవేట్. రెండవ భాగం పబ్లిక్ కోసం.

యెమెన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ధీరూభాయ్ అంబానీ ఈ ఇంట్లో పెరిగారు. ముంబైలో స్థిరపడి వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత ధీరు భాయ్ తన భార్య కోకిలా బెన్ తో కలిసి ఇక్కడికి వచ్చేవారు.

ఒకప్పుడు ఈ స్థలంలో అంబానీ కుటుంబం అద్దెకు ఉండేవారు. అయితే 2002లో ఈ మొత్తం ఆస్తిని కొనుగోలు చేశారు. ఇది 2011 సంవత్సరంలో ధీరూభాయ్ అంబానీ గౌరవార్థం అంబానీ హౌస్‌ను ఏర్పాటు చేశారు.

ముఖేష్ అంబానీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకమైనది. అందుకు కారణం ఆయన జ్ఞాపకాలు ఈ ఇంటికి అంటిపెట్టుకుని ఉండడం. వేసవిలో తాత, నానమ్మ, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇక్కడికి వచ్చేవారు.

అంబానీ కుటుంబానికి చెందిన ఈ పూర్వీకుల ఇల్లు సోమవారం మినహా ప్రతిరోజు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు ఈ భవనం చూడాలనుకుంటే ప్రవేశ రుసుము రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.





























