Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం సేవించిన వారిలో కళ్లు ఎందుకు ఎర్ర బడతాయో తెలుసా.? దీనికి కారణం ఏంటంటే..

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా కొందరు ఆ అలవాటును మానుకోరు. ఏదో ఒక కారణం చెబుతూ మద్యం సేవిస్తుంటారు. అయితే తీసుకున్న తర్వాత శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతుంటాయి. మద్యం తాగితే మత్తు వస్తుందనేది ఎంత నిజమో శరీరంలోని అన్ని భాగాలపై అదే స్థాయిలో ప్రభావం చూపుతుంది...

Alcohol: మద్యం సేవించిన వారిలో కళ్లు ఎందుకు ఎర్ర బడతాయో తెలుసా.? దీనికి కారణం ఏంటంటే..
Alcohol Red Eyes
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 02, 2023 | 5:31 PM

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా కొందరు ఆ అలవాటును మానుకోరు. ఏదో ఒక కారణం చెబుతూ మద్యం సేవిస్తుంటారు. అయితే తీసుకున్న తర్వాత శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతుంటాయి. మద్యం తాగితే మత్తు వస్తుందనేది ఎంత నిజమో శరీరంలోని అన్ని భాగాలపై అదే స్థాయిలో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మద్యం తీసుకున్న వారిని వారి కళ్లను చూసి ఇట్టే గుర్తుపట్టొచ్చు. సాధారణంగా మోతాదుకు మించి మద్యం సేవిస్తే కళ్లు ఎర్రబడుతుంటాయి. అయితే ఇతర సందర్భాల్లోనూ కళ్లు ఎర్రబడినా దానికి గాలి, ధూలి వంటి కారణాలు ఉంటాయి. కానీ మద్యం సేవించిన వారిలో మాత్రం కచ్చితంగా కళ్లు ఎర్రబడడాన్ని గమనించవచ్చు. అయితే ఇంతకీ మద్యానికి కళ్లు ఎర్రబడడానికి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఆల్కహాల్‌ సేవించిన వ్యక్తి రక్త నాళాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఈ కారణంతో శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో కంటి ఉపరితలంపై ఉన్న చిన్న చిన్న రక్త నాళాలు వ్యాకోచించడం మొదలవుతుంది. ఈ కారణంగా కంటిలోని రక్త నాళాలు ఎర్రగా రక్తపు రంగులోకి మారుతాయి. అయితే అందరిలో ఈ లక్షణం కనిపిస్తుందా.? అంటే.. కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేము. ఆల్కహాల్ సెన్సిటివిటీ లేదా ఎక్కువ మద్యం సేవించే వారిలో ఎక్కువగా కళ్లు ఎర్రబడడం గమనించవచ్చు.

ఇక ఆల్కహాల్‌ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. శరీరంలోని ప్రతి అణువుకూ ఆల్కహాల్‌ వెళ్తుంది. ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. అయితే ఆల్కహాల్‌ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆల్కహాల్‌ తీసుకునే వారిలో ఎక్కువ మొత్తంలో కెలొరీలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..