Success Story: ఆ యువకుడి జీవితాన్ని మార్చేసిన కరోనా.. ఉద్యోగాన్ని వదిలి గొర్రెల పెంపకంతో లక్షలు ఆర్జిస్తున్న షబ్బీర్ ముల్లా

వేలాది మంది ప్రాణాలను బలిగొని లక్షలాది కుటుంబాలను వీధిన పడేసి, కష్టాలు సృష్టించిన కరోనా వైరస్..  కొందరికి జీవితంలో గుణపాఠాన్ని నేర్పించింది. జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో.. విజయాన్ని ఎలా సాధించాలో చూపించింది. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొనే కళను ధైర్యాన్నిఇచ్చింది. అందుకు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాడు ఈ యువకుడు. కరోనా మహమ్మారి కారణంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. పొట్టేళ్లను పెంపకాన్ని చేపట్టి ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇతను పెంచిన పొట్టేళ్లు మంచి బరువుతో రికార్డ్ సృష్టిస్తూ.. మంచి గిరాకీని సంపాదించుకున్నాయి. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నుంచి పోటేళ్ల పెంపకందారుగా మారిన యువకుడు గురించి ఈ రోజు తేలుకుందాం.. 

|

Updated on: Jun 02, 2023 | 12:05 PM

25 ఏళ్ల షబ్బీర్ ముల్లా విజయపూర్ జిల్లా బబలేశ్వర్ తాలూకాలోని దేవాపూర్ గ్రామానికి చెందినవాడు. బీకామ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి మహారాష్ట్రలోని పూణెలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుండి పని చేస్తూ సంపాదిస్తున్నాడు. రెండేళ్ల క్రితం స్నేహితుడి సలహాతో పొట్టేళ్ల పెంపకం చేపట్టి ముల్లా ప్రస్తుతం వందలాది పొట్టేళ్లను పెంచుతున్నాడు.

1 / 8
అందరూ మేకలు, గొర్రెల పెంపకం ద్వారా సంపాదిస్తారు. అయితే షబ్బీర్ మాత్రమే బ్రీడింగ్ పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాడు. జిల్లాలోనే తొలిసారిగా బ్రీడింగ్ పోటేళ్లను పెంచుతున్న యువకుడిగా ఖ్యాతి గడించాడు షబ్బీర్. బాగల్‌కోట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోటేళ్ల పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్నాడు. 

2 / 8
పోటేళ్ల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడంతో పాటు క్రమబద్ధమైన పోషక ఆహార ధాన్యాలు,  పశుగ్రాసం అందిస్తూ గొర్రెలను ఆరోగ్యంగా ఉంచుతాడు. ముల్లా పెంచిన పొట్టేలు సగటు బరువు 75 నుంచి 80 కిలోలు ఉంటాయి. కొందరు గొర్రెల కాపరులు షబ్బీర్ సకిరోకు ఒక్కో గొర్రెకు రూ.50 వేలు ఇచ్చారు

3 / 8
మూడు నెలల పొట్టేళ్లను తీసుకొచ్చి 6 నుంచి 7 నెలల వరకు పెంచుతున్నాడు. తర్వాత వాటిని విక్రయిస్తాడు. ఒక్కో పొట్టేలు సగటు ధర 15 నుంచి 18 వేల రూపాయలు. అదేవిధంగా ముల్లా పెంచే పొట్టేళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఒకొక్క పోటీలు సుమారు  40 వేల రూపాయలకు అమ్ముతారు. అయితే ఎక్కువ ధర ఉంటేనే తన పొట్టేళ్లను విక్రయిస్తానని షబ్బీర్ తెలిపాడు.

4 / 8
రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీలో చేస్తునం ఉద్యోగానికి గుడ్ బై చెప్పి..  పొట్టేళ్లను పెంచాలని నిర్ణయించుకున్న సమయంలో చేతిలో డబ్బులు లేవు. తన కలల ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి వివిధ బ్యాంకులకు ఇచ్చినా తక్కువ భూములున్నాయనే కారణంగా రుణం ఇవ్వలేదు. అయినా పట్టు వదలని షబ్బీర్ తన అన్న భాషా సాబ్‌తో కలిసి డబ్బులు పోగు చేసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాడు. 

5 / 8
పొట్టేళ్లు, గొర్రెలు, మేకల పెంపకానికి ఆధునిక షెడ్డు నిర్మించాలి. 100 పొట్టేలు లేదా గొర్రెలు-మేకల పెంపకానికి షెడ్డుని నిర్మించాలి. ఇందు మేరకు 6 నుండి 8 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే  షబ్బీర్ ముల్లా ఖర్చులను అదుపు చేయడానికి తక్కువ ఖర్చుతో అన్నివసతులున్న షెడ్డుని నిర్మించాలని భావించాడు. తన ఆలోచనలకు రూపం ఇస్తూ..  2 నుంచి 2.50 లక్షల రూపాయలతో అన్ని వసతులతో షెడ్డు నిర్మించాడు. తక్కువ డబ్బుతో షెడ్డు నిర్మించి అందరి మెప్పు పొందేలా చేశాడు.

6 / 8
ప్రస్తుతం బెంగుళూరు, చిత్రదుర్గ, మైసూరు, భత్కల్ తదితర ప్రాంతాల నుంచి పొట్టేళ్లకు గిరాకీ ఉంది. మొదటి దశలో పొట్టేళ్లకు మంచి ధరకు విక్రయించాడు. తక్కువ ఖర్చుతో మంచి పొట్టేళ్ల పెంపకం ద్వారా లాభాలను ఆర్జిస్తున్న ముల్లాపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   

7 / 8
ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న షబ్బీర్ స్వయం ఉపాధిని చేపట్టి పొట్టేళ్ల పెంపకంతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు దేవాపూర్ గ్రామానికి చెందిన షబ్బీర్ ముల్లా.  

8 / 8
Follow us
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.

ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై

ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?