Astro Rules For Fasting: ఉపవాసం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటో తెలుసా..

ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. స్వచ్ఛంగా ఉండటమే. ఉపవాసం పాటించడం వల్ల శరీరంలో, జీవితంలో సానుకూల భావన కలుగుతుంది. హిందూ మతంలో ఉపవాసానికి చాలా నియమాలున్నాయి. వీటిని విస్మరించడం వల్ల పుణ్యఫలం లభించదు. ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో  ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

Astro Rules For Fasting: ఉపవాసం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటో తెలుసా..
Fasting Rules
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 11:34 AM

ప్రతి మతంలో.. ప్రజల వారి విశ్వాసం ప్రకారం ఉపవాసం ఉంటారు. పూజలు, ఉపవాసాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఉపవాసం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి  ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది. చాలా మంది ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపవాసం ఉంటారు. తమకు దేవుడి పట్ల ఉన్న విశ్వసాన్ని ఉపవాస దీక్షతో వ్యక్తం చేస్తారు. హిందూమతంలో పండగ, పర్వదినాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఉపవాసం ఉండాలనే చట్టం ఉంది. అదే విధంగా వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవతకి అంకితం చేశారు. ఈ రోజుల్లో వివిధ దేవతల పేరుతో ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. స్వచ్ఛంగా ఉండటమే. ఉపవాసం పాటించడం వల్ల శరీరంలో, జీవితంలో సానుకూల భావన కలుగుతుంది. హిందూ మతంలో ఉపవాసానికి చాలా నియమాలున్నాయి. వీటిని విస్మరించడం వల్ల పుణ్యఫలం లభించదు. ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో  ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

  1. ఉపవాసం చేయాలనుకునేవారు దేవుడికి పూజ చేసే ముందు హృదయ పూర్వకంగా నమస్కరించాలి.  ఆహారం పట్ల మనసుని నిగ్రహంగా ఉంచుకోవాలి.
  2. అందుకే ఉపవాస సమయంలో శరీరం, మనస్సుపై సంయమనం పాటించడం చాలా ముఖ్యం. ఎదురుగా ఎంత ఇష్టమైన ఆహారం కనిపించినా మనసు వాటి గురించి ఆలోచించవద్దు.
  3. ఉపవాస దీక్షను ఆచరిస్తున్నప్పుడు మనసులో ఎవరి పట్లా చెడు భావాలు ఉండకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. ఉపవాసం చేసిన రోజంతా భగవంతుని స్మరణతో ఆరాధించాలి.
  4. ఏదైనా కోరికతో ఉపవాసం ప్రారంభించినట్లయితే, జ్యోతిష్యుడిని సంప్రదించి, శుభ సమయంలో మాత్రమే ఉపవాసాన్ని ప్రారంభించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. స్త్రీలు బహిష్టు సమయంలో ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం ఉన్నా ఆ రోజులను లెక్కించరాదు. అలాగే ఉపవాసంలో బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం.
  7. నియమ నిష్ఠల ప్రకారం ఉపవాస దీక్షను పూర్తి చేసినట్లయితే.. అప్పుడు ఖచ్చితంగా ఉద్యాపన చేయండి.  లేకుంటే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించబడదు. అంతేకాదు ఉపవాసం చేసిన పుణ్య ఫలం లభించదు.
  8. ఉపవాసం చేసిన నిద్రపోకూడదు. నిద్రపోయినట్లు అయితే ఉపవాసం చేసిన ఉద్దేశ్యం ఏదైనా, అది నెరవేరదు. అదే విధంగా ఉపవాసం చేసే సమయంలో ఎవరి మీదా కోపం తెచ్చుకోకూడదు.
  9. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి, పొరపాటున కూడా తామసిక వస్తువులను ముట్టుకోకూడదు, ముందుగా భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ ఆహారాన్ని తీసుకోవాలి.
  10. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికీ హాని కలిగించకూడదు. ముఖ్యంగా పేదల పట్ల, జంతువుల పట్ల కరుణ కలిగి ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.