- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti on how to overcome sadness and pain in life in telugu
Chanakya Niti: జీవితంలో ఎదురయ్యే దుఃఖం, బాధ నుంచి బయటపడడానికి చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు గుర్తుంచుకోండి..
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలోని సవాళ్లు, దుఃఖాలను అధిగమించడానికి అనేక మార్గాలను అందించాడు. అంతేకాదు మనిషికి ఉండాల్సిన క్రమశిక్షణ, జ్ఞానం, తెలివి తేటలు ఆవశ్యకతను గురించి ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. దీనికి సంబంధించిన చాణక్యుడి కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 04, 2023 | 12:29 PM

సానుకూల ఆలోచనలను పెంపొందించుకోండి: జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి సారించాలని అలాగే మనస్సును అందుకు అనుగుణంగా తగిన శిక్షణ ఇవ్వాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేయడం వలన సానుకూల ఆలోచనలు, కృతజ్ఞత, ఆశావాదాన్ని పెంపొందించుకోండి. ఇలా చేయడం వలన మీలో ఉత్సాహం పెరుగుతుంది. సమతుల్య భావాన్ని అందిస్తుంది.

అనుభవాల నుండి నేర్చుకోండి: జీవితంలో తగిలే ఎదురుదెబ్బ, బాధలో ఒక పాఠం దాగి ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. ఈ అనుభవాలను వృద్ధి, స్వీయ-అభివృద్ధికి అవకాశాలుగా ఉపయోగించండి. పరిస్థితిని విశ్లేషించండి, అంతర్లీన కారణాలను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి అనుభవాలనుంచి పాఠాలను నేర్చుకోండి.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

చదువుకు దూరమయ్యారు: పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని ఆచార్య చాణక్యుడు అన్నారు. అలాంటి పిల్లలు పండితులకు మాత్రమే కాదు సహచర విద్యార్థులకు జోక్ గా మారతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యం.

అంగీకారం, ఆసక్తి లేకపోవడం: చాణక్యుడు ప్రకారం నొప్పి, విచారం జీవితంలో అనివార్యమైన భాగాలు. వాటిని అంగీకరించడం తప్పనిసరి. అంతేకాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో నొప్పి, విచారం తప్పనిసరి అని భావించి ముందుకు సాగితే.. అంతర్గత శాంతిని సాధించడంలో సహాయపడుతుంది. జీవితంలో ఏ బాధైనా, విచారణ అయినా శాశ్వతం కాదని గుర్తుంచుకోండి.




