గ్రహ సంచారం గ్రహాల స్థితిని బట్టి రాశుల వారికి వారి వ్యక్తిగత జీవితాలలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు వారి జీవితాలపై అధిక ప్రభావాన్ని కనబరుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మేష రాశిలో గురు, రాహువుల సంచారం జరుగుతోంది. అదేవిధంగా వృషభంలో రవి, బుధులు, కర్కాటకంలో కుజ, శుక్రులు, తులా రాశిలో కేతువు, కుంభరాశిలో శని సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.