- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti to remove stress and tension and focus on goals in life in telugu
Chanakya Niti: ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉండటానికి చాణక్యుడు చెప్పిన ఈ విధానాలను అనుసరించండి
కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే చాణక్యుడు తత్వ వేత్త. రాజనీతిజ్ఞుడు. మానవ జీవితం, పాలనలకు సంబంధించి విధానాలను నీతి శాస్త్రంలో వెల్లడించాడు. నేటి మానవాళికి కూడా అనుసరణీయం చాణుక్యుడు చెప్పిన విధానాలు. ఈ రోజు జీవితంలో ఒత్తిడిని తొలగించడంలో సహాయపడే చాణక్యుడి బోధనల గురించి మనం తెలుసుకుందాం.
Updated on: Jun 05, 2023 | 1:23 PM

సమస్యను విశ్లేషించండి: ఆచార్య చాణక్యుడు ఏదైనా చర్య తీసుకునే ముందు, సమస్యను పూర్తిగా విశ్లేషించండి. దాని మూల కారణం, చిక్కులు, సాధ్యమైన పరిష్కారాలను అర్థం చేసుకోండి. స్పష్టమైన అవగాహన వస్తే.. అప్పుడు సమస్యను వ్యూహాత్మకంగా పరిష్కారం చేసుకోవడంలో సహాయపడతాయి. దీనితో పాటు, కష్టాలను దృఢంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా లభిస్తుంది.

పరస్పర గౌరవం: వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. భార్యాభర్తలు తమ ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.

సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.




