Astro Tips for Prosperity: ఇల్లు సిరిసంపదలతో కళకళాడాలంటే.. ఇలా పూజ చేసి చూడండి..

సుఖ సంతోషాల కోసం కొన్ని సార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ.. కొంతమంది కోరికలు నెరవేరవు. జీవితానికి సంబంధించిన ఏదొక కష్టం వారిని చుట్టుముడుతునే ఉంటుంది. దురదృష్టం నుండి బయటపడి  జీవితంలో అదృష్టం పొందాలంటే.. కొన్ని సనాతన ధర్మంలో కొన్ని నివారణలు సూచించారు.   

Astro Tips for Prosperity: ఇల్లు సిరిసంపదలతో కళకళాడాలంటే.. ఇలా పూజ చేసి చూడండి..
Goddess Lakshmi Puja
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 10:57 AM

ప్రతి ఒక్కరూ తన ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉండాలని.. కలలో కూడా కష్టాలు తన ప్రాంగణంలో అడుగు పెట్టకూడదని కోరుకుంటారు. తమ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు. అయితే  సుఖ సంతోషాల కోసం కొన్ని సార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ.. కొంతమంది కోరికలు నెరవేరవు. జీవితానికి సంబంధించిన ఏదొక కష్టం వారిని చుట్టుముడుతునే ఉంటుంది. దురదృష్టం నుండి బయటపడి  జీవితంలో అదృష్టం పొందాలంటే.. కొన్ని సనాతన ధర్మంలో కొన్ని నివారణలు సూచించారు.

  1. హిందూ విశ్వాసం ప్రకారం..ఇంటి ఆనందం, శ్రేయస్సు ఇంటి ప్రధాన తలుపుకి సంబంధం కలిగి ఉంటుంది, ఎందుకంటే సంపద, ధన, ధాన్యాలు, ఆనందం దీని ద్వారా ప్రవేశిస్తాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి తన ప్రధాన తలుపును శుభ్రంగా ఉంచుకోవాలి. అన్ని రకాల శుభ చిహ్నాలను కలిగి ఉండాలి. ప్రధాన ద్వారంలో అడ్డంకులు ఉన్నవారికి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడతాయని  నమ్మకం. అటువంటి పరిస్థితిలో ఇంటికి సంబంధించిన తన ప్రధాన తలుపుకు సంబంధించిన ఏదైనా లోపాన్ని లేదా అడ్డంకిని వీలైనంత త్వరగా తొలగించాలి.
  2. హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు కలిపిన నీటిని ఇంటి ప్రధాన ద్వారం, ఇంటి నాలుగు మూలల్లో చల్లితే, వ్యక్తి సుఖ సంతోషాలను పొందుతాడు.
  3. హిందూ విశ్వాసం ప్రకారం ఏ వ్యక్తి జీవితానికి సంబంధించిన అదృష్టం, ఆరోగ్యంలో సూర్య భగవానుడు పాత్ర అధికంగా ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ఉదయించే సమయంలో భాస్కరునికి అర్ఘ్యం సమర్పించిన వారి జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధిస్తారని నమ్ముతారు.
  4. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎప్పుడూ కురుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే, మీరు ఎల్లప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పొరపాటున శుభ్రం గా లేని చేతితో సంపద లేదా డబ్బును ఎప్పుడూ తాకకూడదు. శ్రీయంత్రాన్ని ప్రతిరోజూ పూజించే ఇంట్లో, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సనాతన సంప్రదాయంలో  చేపలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇవి సంపద దేవత అయిన లక్ష్మీ దేవికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. పూజించే ఇంట్లో లేదా సంపద ఉన్న ప్రదేశంలో వెండి లక్ష్మి ఉన్నవారికి ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. కెరీర్-వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి వెళుతున్నప్పుడు వెండి చేప కనిపిస్తే, సంబంధిత పనిలో విజయావకాశాలు పెరుగుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).