ఈ పుట్టగొడుగులు కిలో రూ. 20 లక్షలు.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్.. కోటీశ్వరులు కావాలంటే పండించండి..

కొన్ని రకాల పుట్టగొడుగులను పెంచడం వలన కోటీశ్వరుడులు కూడా కావొచ్చు. అవును ఈ వెరైటీ పుట్టగొడుగుల ఖరీదు వేల కాదు, లక్షల రూపాయలు. ఎవరైనా ఈ  రకమైన పుట్టగొడుగులను పండించడం మొదలు పెడితే.. అతను కోటీశ్వరుడు అవుతాడు. అయితే ఈ పుట్టగొడువుల పెంపకం కోసం ఇంట్లోనే ల్యాబ్‌ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.  

ఈ పుట్టగొడుగులు కిలో రూ. 20 లక్షలు.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్.. కోటీశ్వరులు కావాలంటే పండించండి..
Cordyceps Mushroom
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2023 | 8:25 AM

వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఎక్కువుగా కనిపించే పుట్టగొడుగులను ఇప్పుడు రైతులు పండిస్తున్నారు.  దీని ధర కిలోకు 250 నుండి 500 రూపాయల వరకు ఉంటుంది. ఈ పుట్టగొడుగుల సాగుతో రైతులు చాలా లాభాలు పొందుతున్నారు. అయితే కొన్ని రకాల పుట్టగొడుగులు తినడానికి ఉపయోగపడితే.. మరికొన్ని ప్రాణాలకు హానిని కలిగిస్తాయి. అయితే కొన్ని రకాల పుట్టగొడుగులను పెంచడం వలన కోటీశ్వరుడులు కూడా కావొచ్చు. అవును ఈ వెరైటీ పుట్టగొడుగుల ఖరీదు వేల కాదు, లక్షల రూపాయలు. ఎవరైనా ఈ  రకమైన పుట్టగొడుగులను పండించడం మొదలు పెడితే.. అతను కోటీశ్వరుడు అవుతాడు. అయితే ఈ పుట్టగొడువుల పెంపకం కోసం ఇంట్లోనే ల్యాబ్‌ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పుట్టగొడుగుని యార్సగుంబా పుట్టగొడుగు అని అంటారు.. అంతేకాదు దీనిని వార్మ్వుడ్ అని కూడా పిలుస్తారు. అయితే ఎక్కువ మంది ఈ పుట్టగొడుగుని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. ఈ పుట్టగొడుగులో ఔషధ మూలికలు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వాటిని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.  పుట్టగొడుగుతో కూరగాయను తయారు చేయడమే కాదు.. ఔషధ ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తంలో దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో యార్సగుంబా పుట్టగొడుగు  ఖరీదు రూ.20 లక్షలు. ఈ పుట్టగొడుగు పురుగులా కనిపిస్తుంది.  అందుకే దీనిని వార్మ్‌వుడ్ అని అంటారు.

యార్సగుంబా పుట్టగొడుగును సాగు చేస్తున్న రైతులు 

ఇవి కూడా చదవండి

ఈ పుట్టగొడుగులను 3500 మీటర్ల ఎత్తులో సాగు చేస్తారు. భారతదేశంలో,రైతులు హిమాలయ పర్వతాలలో దీనిని సాగు చేస్తారు. అంతేకాదు చైనా, నేపాల్, భూటాన్, టిబెట్‌లలో రైతులు దీనిని పండిస్తారు. వార్మ్‌వుడ్ ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని చమోలి, పితోరాఘర్ ,బాగేశ్వర్ జిల్లాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక రకమైన అడవి పుట్టగొడుగు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ పుట్టగొడుగును సాగు చేస్తున్నారు. ఇటావా జిల్లాలోని మహేవా డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఉన్న రహత్‌పూర్ గ్రామంలో గౌరవ్ కశ్యప్ అనే రైతు ఈ పుట్టగొడుగును సాగు చేస్తున్నాడు. ఒక గది లోపలే ల్యాబ్ ను ఏర్పాటు చేసి యార్సగుంబా పుట్టగొడుగును సాగు చేస్తున్నారు. లక్షలను ఆర్జిస్తున్నాడు.

ల్యాబ్‌లో ఏడాదిలో 6 సార్లు పెంపకం 

వార్మ్‌వుడ్ శాస్త్రీయ నామం కార్డిసెప్స్ సైనెన్సిస్. ఒక అంచనా ప్రకారం యార్సగుంబా పుట్టగొడుగు బిజినెస్ ఆసియాలో రూ.200 కోట్ల మేర జరుగుతోంది. యార్సగుంబా పుట్టగొడుగుని ఆహారంగా తీసుకోవడం ద్వారా, శరీరానికి అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచుతుంది. ఇంటి లోపల పండించాలంటే.. దీని కోసం ల్యాబ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు రూ.20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అంతేకాదు ల్యాబ్‌లో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి  ఏసీని అమర్చాలి. అంతేకాదు ల్యాబ్‌లో తేమను నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇలా ల్యాబ్ ను ఏర్పాటు చేసుకుని యార్సగుంబా పుట్టగొడుగుని సంవత్సరంలో 6 సార్లు పెంచవచ్చు. లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..